HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Leader Doondi Rakesh Comments On Vellampali Srinivas

TDP vs YCP : ఆర్యవైశ్యులంటే వైసీపీ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష? : టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ కు టీడీపీ నేత డూండి రాకేష్ ప్రతిసవాల్ విసిరారు. డిసెంబర్ 3న ఉదయం

  • Author : Prasad Date : 27-11-2023 - 8:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ కు టీడీపీ నేత డూండి రాకేష్ ప్రతిసవాల్ విసిరారు. డిసెంబర్ 3న ఉదయం 11.30గంటలకు విజయవాడ వన్ టౌన్ లో కొత్తగుడుల కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చర్చకు రెడీ అన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్ ను సీఎం కాకుండా మాజీ సీఎం రోశయ్య అడ్డుకున్నారనే అక్కసుతో ఆర్యవైశ్యులపై కక్ష కట్టడం తగదని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేశ్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తోందని… ఆర్యవైశ్య సోదరులపై కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. కులగణన తెచ్చి వైశ్యుల్లో చీలిక తెచ్చారని… ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత, నిధులు, కార్పొరేషన్ ఇవేవీ అవసరం లేనట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. చంద్రగిరి పోలీసు స్టేషన్ లో శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ ఆర్యవైశ్యుడిని బెదిరిస్తే పెట్రోల్ మీద వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తే దీనిపై ఎందుకు స్పందించ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నాలుగున్నర సంవత్సరాలలో 13 మంది ఆర్యవైశ్యులు ఆత్మహత్య చేసుకున్నారని.. విపరీత ట్యాక్సులు వేసి ఆర్యవైశ్యులను ఇబ్బంది పెడుతున్నారని డూండి రాకేష్ తెలిపారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగిగినా కోట్లాది రూపాయలు వ్యాపరస్థులను బెదిరించి దండుకుంటున్నారని ఆయ‌న ఆరోపించారు. కార్తిక పౌర్ణమి రోజున కృష్ణా నది ఒడ్డున కనకదుర్గమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న పున్నమి ఘాట్ లో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ గారి స్థలంలో ఆర్యవైశ్యులం ప్రతి సంవత్సరం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించుకుంటారని.., ఎప్పటిలాగే ఈ యేడాది నిర్వహించదలచుకుంటే దాన్ని అడ్డుకుంటున్నారన్నారు. పేద ఆర్యవైశ్యులు తమ జీవితాల్లో మార్పు రావాలని వాసవీ ఫౌండేషన్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కలిసి 19వ తేదిన సత్యనారాయణ స్వామి వ్రతాలు పెట్ట దలచి.. 20 రోజులకు ముందే అనుమతికై దరఖాస్తు చేసుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. 3 పేజీల నోటీసు ఇచ్చి మీరు వన సమారాధన చేసుకోవడానికి వీలు లేదన్నారని తెలిపారు.

Also Read:  DP vs YCP : ఆర్య‌వైశ్యుల‌కు నేనేమి చేసానో చ‌ర్చ‌కు సిద్ధం.. బాబు,లోకేష్‌, ప‌వ‌న్‌కు మాజీ మంత్రి వెల్లంప‌ల్లి స‌వాల్‌

కల్యాణ మండపాల్లో నిర్వహించదలచుకుంటే కల్యాణ మండపాల్లో సభలు, సమావేశాలు నిర్వహించరాదని సర్కులర్ పాస్ చేశారని… సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించరాదని 30 యాక్టు పెట్టారని రాకేష్ ఆరోపించారు. కొణజేటి రోశయ్యపై ఉన్న కోపాన్ని మీరు ఆర్యవైశ్యులపై తీర్చుకుంటున్న మాట వాస్తవం కాదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అడ్డుకొని వెల్లంపల్లి శ్రీనివాస్ పాపం మూటగట్టుకున్నాడని.. జగన్ హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినవారిని ప్రోత్సహిస్తున్నాడని తెలిపారు. హిందూయిజాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తే.. చూస్తూ ఊరుకోమ‌న్నారు. తొందరలోనే ఆర్య‌వైశ్యులంద‌రం ఏకమౌతామ‌ని. . డిసెంబర్ 3 వ తేదిన 11.30కు తాను బహిరంగకు సిద్ధమ‌ని తెలిపారు.. ఆర్యవైశ్యులపై వైసీపీ ప్రభుత్వం చేసిన దురాగతాలను సాక్షాలతో సహా వచ్చి బయట పెడతానని తెలిపారు. ధైర్యం ఉంటే వెల్లంపల్లి బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • Aryavysa
  • cm jagan
  • Doondirakesh
  • MLA Vellampalli Srinivas
  • tdp
  • ysrcp

Related News

Avinash Reddy faces setback in Supreme Court

వెంటనే లొంగిపోవాలి .. అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు

దేశ అత్యున్నత న్యాయస్థానం అవినాష్‌రెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

  • Ambati Rambabu

    అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

  • Ap Legislative Council

    మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Latest News

  • టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

  • ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

  • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

  • పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలివే!

  • టీమిండియా సెమీ ఫైన‌ల్‌కు చేరాలంటే?!

Trending News

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd