HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Janasena Agree To Give Ap Rajya Sabha Seat To Bjp

Rajya Sabha: ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. రేసులో అన్నామలై, స్మృతి ఇరానీ

కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమి ఉమ్మడి ప్రయోజనాల రీత్యా  ఏపీలోని రాజ్యసభ(Rajya Sabha) స్థానాన్ని బీజేపీకే ఇచ్చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్  డిసైడయ్యారు.

  • Author : Pasha Date : 22-04-2025 - 6:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Rajya Sabha Seat Bjp Andhra Pradesh Tdp Janasena Annamalai Smriti Irani

Rajya Sabha: విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానం భవితవ్యంపై క్లారిటీ వచ్చింది. ఆ స్థానాన్ని బీజేపీకే కేటాయించాలని జనసేన, టీడీపీ నిర్ణయించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమి ఉమ్మడి ప్రయోజనాల రీత్యా  ఏపీలోని రాజ్యసభ(Rajya Sabha) స్థానాన్ని బీజేపీకే ఇచ్చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్  డిసైడయ్యారు.

Also Read :KTR : నర్సింగ్‌లాంటి కార్యకర్తలుంటే కాంగ్రెస్ కుట్రలు సాగవు : కేటీఆర్

మే 9న ఎన్నిక 

తాజాగా ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు..  రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై చర్చించారు.  ఏపీ కోటాలోని రాజ్యసభ సీటు కోసం తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్‌ అన్నామలై, మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పోటీపడుతున్నట్లు సమాచారం. అయితే వీరిలో ఎవరికి బీజేపీ పెద్దలు ప్రయారిటీ ఇస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఏపీలోని ఒక రాజ్యసభ స్థానానికి ఏప్రిల్ 29 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మే 9న ఎన్నిక జరగనుంది. అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఈ స్థానం నుంచి ఎన్నికయ్యే వారికి 2028 జూన్ వరకు పదవీకాలం ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో కూటమికి స్పష్టమైన బలం ఉంది. దీంతో ఈ ఎన్నిక నల్లేరుపై నడకే.

Also Read :Tanda Gangs : తెలుగు రాష్ట్రాల్లో టాండా దొంగలు.. ఎవరు ?

అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి కూడా..  ?

అన్నామలై విషయానికొస్తే.. ఆయన 2021 నుంచి 2025 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి 3 శాతం ఓట్లే వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీకి 11 శాతం ఓట్లు వచ్చాయి.  అన్నామలై వల్లే ఈ మార్పు వచ్చిందని బీజేపీ పెద్దలు గుర్తించారు. అందుకే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. తద్వారా వచ్చే సంవత్సరం (2026లో) జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని మరింతగా పెంచుకోవచ్చని కమలదళం పెద్దలు అనుకుంటున్నారు. అందుకోసమే ఏపీ నుంచి అన్నామలైను రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. అయితే ఏపీ రాజ్యసభ సీటు కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతలు మాధవ్, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, పాతూరి నాగభూషణం కూడా ట్రై చేస్తున్నారు. తమను కాదని ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలకు ఛాన్స్ ఇవ్వొద్దని వారు లోలోపల అనుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • annamalai
  • AP Rajya Sabha
  • AP Rajya Sabha Seat
  • bjp
  • Janasena
  • Rajya Sabha
  • smriti irani
  • tdp

Related News

Skilling Advisor Seetha Sharma Resigns from Skill Development Department

ఏపీ సలహాదారు పదవికి సీతా శర్మ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతా శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే ఆమె వైదొలగడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, గత మార్చి 5న సీతా శర్మ తన రాజీనామా

  • Nara Bhuvaneshwari Anna Canteens

    Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

Latest News

  • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

  • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

  • భార‌త్‌పై ట్రంప్ చిందులు!

  • WB Polling : పోలింగ్ కేంద్రానికి వచ్చిన భారీ ఏనుగు.. పరుగులు పెట్టిన ఓటర్లు

  • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

Trending News

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd