HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Chief Chandrababu Demands Governor Rule In Andhra Pradesh

రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు చంద్ర‌బాబు డిమాండ్

ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాల‌పై మూకుమ్మ‌డి దాడుల‌కు వైసీపీ దిగ‌డాన్ని నిర‌సిస్తూ ఆయ‌న దీక్ష‌కు దిగారు.

  • Author : Hashtag U Date : 21-10-2021 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాల‌పై మూకుమ్మ‌డి దాడుల‌కు వైసీపీ దిగ‌డాన్ని నిర‌సిస్తూ ఆయ‌న దీక్ష‌కు దిగారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో 36 గంట‌ల దీక్ష చేస్తున్న ఆయ‌న రాష్ట్రంలోని ప‌రిస్థితులు ఆర్డిక‌ల్ 356కు అనుగుణంగా ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని బాబు కోరుతున్నాడు.

డ్ర‌గ్స్ మూలాలు ఏపీలో ఉన్నాయి. ఆ విష‌యాన్ని టీడీపీ కొన్ని రోజులుగా ఆధారాల‌తో స‌హా ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి ముఠాలు త‌యారు అయ్యాయ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. క‌నీసం 8వేల నుంచి 25వేల కోట్ల వ‌ర‌కు వివిధ ర‌కాల మ‌త్తు ప‌దార్థాలు ఏపీలో స‌ర‌ఫ‌రా అవుతున్నాయ‌ని ఆరోపించారు. కొన్ని చోట్ల గంజాయిని పెంచుతున్నార‌ని అన్నారు. యువ‌త‌ను నిర్వీర్యంచేసేలా డ్ర‌గ్స్, గంజాయి పంపిణీ ఏపీ కేంద్రంగా జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. హ‌త్య‌లు, అత్యాచారాలు, ప్ర‌త్య‌ర్థి పార్టీల మీద దాడులు చేసుకుంటున్నందున రాష్ట్ర‌ప‌తి పాల‌న అవ‌స‌ర‌మ‌ని బాబు భావిస్తున్నారు.

తెలంగాణ డీజీపీ ఏపీలోని గంజాయి స్మ‌గ్లింగ్ మీద దాడులు చేయించార‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, త‌మిళనాడు, తెలంగాణ రాష్ట్రాల‌కు ఏపీ నుంచే గంజాయి స‌ర‌ఫ‌రా అవుతోంద‌ని ఆరోపించారు. అందుకే, ఇటీవ‌ల ముంబాయ్, తెలంగాణ పోలీసులు ఏపీలోని ప‌లు ప్రాంతాల్ల‌లో దాడులు నిర్వ‌హించారు. ఏపీ కేంద్రంగా పెద్ద ఎత్తున స్మ‌గ్లింగ్ జ‌రుగుతుంద‌ని నిర్థారించారు. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. రాజ‌కీయంగా డ్ర‌గ్స్, గంజాయి స‌ర‌ఫ‌రాల మీద టీడీపీ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న వైసీపీ మీద దాడి చేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోలు త‌ప్పింద‌ని ఆయ‌న భావిస్తున్నారు. అన్ని కోణాల నుంచి రాజ్యాంగంలోని 356 ఆర్టిక‌ల్ అమ‌లుకు ఏపీలో ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నాయ‌ని బాబు వాదిస్తున్నారు. కేంద్రం అందుకు అంగీక‌రిస్తుందా..అనేది చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • cm jagan
  • tdp office attack
  • telugu desam party
  • ys jagan

Related News

Let Us Make Mahanadu a Success: Minister Nara Lokesh

Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్‌

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడును ఈసారి క్లస్టర్ల స్థాయిలో ఒక పండుగ వాతావరణంలో, కలిసికట్టుగా విజయవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. హైబ్రిడ్ విధానంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు సన్నాహకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,875 క్లస్టర్ ఇంఛార్జ్‌లతో ఆయన ఆన్‌లైన్ ద్వారా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ

  • Atchannaidu fires on ys Jagan

    Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

  • The Godavari Flows Nearby... Yet Kovvur Faces Drinking Water Crisis

    Kovvur Drinking Water Crisis: పక్కనే గోదావరి.. అయినా కొవ్వూరు కు తప్పని నీటి కష్టాలు

  • Bhaskar Award Could Be Given to YS Jagan: Nara Lokesh

    Nara Lokesh: వైఎస్ జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్

  • TDP Mahanadu with the Theme 'Women's Empowerment' — Politburo Approves Resolutions!

    Mahanadu 2026: ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో టీడీపీ మహానాడు.. తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!

Latest News

  • Relationship Tips : భార్య యొక్క ఈ ప్రవర్తన వైవాహిక జీవితం నాశనం కావడానికి కారణం కావచ్చు!

  • Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా

  • Akkineni Nagarjuna: మే 23.. మర్చిపోలేని రోజు: నాగార్జున స్పెషల్ పోస్ట్‌

  • Sleeping: నేలపై కాకుండా బెడ్‌పై నిద్రిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

  • Kavya Maran: SRH ఓనర్ కావ్య మారన్ పెళ్లి

Trending News

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd