TDP : నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు
మార్చి 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా, వెనుకబడిన వర్గాలకు చెందిన బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్.. ఎస్సీ సామాజికవర్గం కావలి గ్రీష్మకు టీడీపీ అవకాశం కల్పించింది.
- By Latha Suma Published Date - 03:22 PM, Mon - 10 March 25

TDP : టీడీపీ నేతలు బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్, కావలి గ్రీష్మ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి వీరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ దఫాలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీయేకు అన్ని స్థానాలూ గెలుచుకునే అవకాశముంది.
Read Also: Congress : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్.. సీఎం రేవంత్ హాజరు
ఏపీలో మార్చి 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా, వెనుకబడిన వర్గాలకు చెందిన బీటీ నాయుడు, బీద రవిచంద్రయాదవ్.. ఎస్సీ సామాజికవర్గం కావలి గ్రీష్మకు టీడీపీ అవకాశం కల్పించింది. జనసేన నుంచి నాగబాబు, బీజేపీ తరఫున సోము వీర్రాజు అభ్యర్థిత్వాలు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, టీడీపీలో ఆశావహులు ఎక్కువ కావడంతో అభ్యర్థుల ఎంపిక కష్టమైంది. అనేక వడపోతల తర్వాత పైన పేర్కొన్న ముగ్గురిని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఇప్పటికే జనసేన నుంచి డిప్యూటీ కల్యాణ్ పవన్‌కల్యాణ్ అన్న నాగబాబు నామినేషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరో సీటు తమకు ఇవ్వాల్సిందే అని బీజేపీ పట్టుబట్టినట్టు తెలిసింది. దీంతో ఆ పార్టీకి ఒక సీటును టీడీపీ వదిలిపెట్టింది. ఐదు సీట్లను కూటమి పార్టీలు పంచుకున్నట్టైంది.
Read Also: Failure Story : మరో అనిల్ అంబానీ.. ప్రమోద్ మిట్టల్ ఫెయిల్యూర్ స్టోరీ.. చూసి నేర్చుకోండి