Thalliki Vandanam : తల్లికి వందనం రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంలో రెండో విడత డబ్బుల విడుదలకు తేదీ ఖరారైంది.
- By Kavya Krishna Published Date - 04:53 PM, Thu - 3 July 25

Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంలో రెండో విడత డబ్బుల విడుదలకు తేదీ ఖరారైంది. జులై 10న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధిదారుల జాబితా అధికారులు సిద్ధం చేశారు. ఈ విడతలో తొలి విడతలో డబ్బులు అందుకోలేకపోయిన వారు, అలాగే కొత్తగా ఒకటో తరగతి , ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థుల తల్లులు లబ్ధి పొందనున్నారు. తొలి విడతలో మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.
Coffee : కాఫీ ఇష్టంగా తాగుతున్నారా? ఆరోగ్యానికి హాని చేసే ఈ విషయాలు మర్చిపోవద్దు!
ప్రస్తుతం ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ కోర్సుల అడ్మిషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో, మరింత మందికి ప్రయోజనం చేకూర్చేందుకు జూలై 10న జరగనున్న మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ రోజునే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు, ఒకటో తరగతిలో 5.5 లక్షల మంది, ఇంటర్ ఫస్టియర్‌లో 4.7 లక్షల మంది విద్యార్థులు చేరినట్లు సమాచారం. మిగిలిన ఒక వారం సమయంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
CM Chandrababu : ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు : సీఎం చంద్రబాబు