Supreme Court: తెలంగాణ సర్కార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం…ఏపీ ఉద్యోగులను పట్టించుకోరా అంటూ..!!
తెలంగాణ సర్కార్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది.
- By hashtagu Published Date - 03:52 PM, Tue - 11 October 22

తెలంగాణ సర్కార్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదని సుప్రీంకోర్టుకు తెలిపారు ఉద్యోగులు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారంటూ తెలంగాణ సర్కార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్ లు ఇవ్వకపోవడంపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు చివరి ఛాన్స్ ఇస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. రెండు వారాల్లో నివేదికలను అమలు చేయాల్సిందేనని ఆదేశించింది. ఆంధ్ర నుంచి రిలీవ్ అయిన 84మందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది కోర్టు.