TV9 Haseena Trolling : మహిళ జర్నలిస్ట్ హసీనా కు సపోర్ట్ గా నిలిచిన NWMI
- By Sudheer Published Date - 12:04 PM, Thu - 18 January 24

TV9 జర్నలిస్ట్ హసీనా (TV9 Haseena) ఫై టీడీపీ మద్దతు దారులు చేస్తున్న జుగుప్సాకరమైన ట్రోలింగ్ (TV9 Haseena Trolling) ఫై యావత్ మీడియానే కాదు యావత్ ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ అని కూడా చూడకుండా వారు చేస్తున్న ట్రోలింగ్ ఫై సర్వత్రా ఆగ్రహపు జ్వాలాలు ఎగిసిపడుతున్నాయి. ఇదేనా టీడీపీ సంస్కారం..ఇదేనా అన్నగారు కోరుకున్నది..యావత్ ఆడపడుచులు అన్న గా కొలిచే టీడీపీ పార్టీ ఈరోజు ఓ మహిళ అని కూడా చూడకుండా ఈ విధంగా ట్రోల్స్ చేయడం , అసభ్యకరంగా కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ TV9 ఛానల్ లో సీనియర్ జర్నలిస్ట్ అయినా హసీనా..తాజాగా ఏపీ సంక్రాంతి వేడుకలను కవర్ చేసేందుకు ఏపీకి వెళ్లడం జరిగింది. సంక్రాంతి సంబరాలతో పాటు అధికార పార్టీ నేతలను సైతం పలు ఇంటర్వ్యూ లు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో స్థానిక గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) బైక్ ఫై వెళ్లడం ఫై టీడీపీ మద్దతుదారులు నెగిటివ్ ట్రోల్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సాధారణంగా ఒక రిపోర్టర్, ఒక రాజకీయ నాయకుడి బైక్ మీద ఎక్కడం పెద్ద తప్పు కాదు. ఆ లెక్కన చూసుకుంటే రాజకీయ పార్టీల నాయకులు న్యూస్ చానల్స్ యాజమాన్యాల ఇళ్లకు వెళ్లడం లేదా? అక్కడ టికెట్ల కేటాయింపుకు సంబంధించి చర్చలు జరగడం లేదా? వాటితో పోలిస్తే హసీనా, కొడాలి నాని బైక్ ఎక్కడం పెద్ద విషయం కాదు కదా..కానీ హసీనా కొడాలి నాని బండి ఎక్కడం టిడిపి నాయకులకు పెద్ద ద్రోహం లాగా కనిపించింది. అదేదో జరగకూడని తప్పు జరిగిపోయిందని వారికి అనిపించింది. ఇంకేముంది సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఆ వీడియోను ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు.
ఓ మీడియా సంస్థలో పని చేస్తున్న జర్నలిస్టు ఇలా వెళ్లడం కరెక్ట్ కాదంటూ కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బూతులు తిట్టడం, అసభ్యకరంగా పిక్స్ ఫై టైటిల్స్ పెట్టడం.. అంతే కాకుండా ఆ ఫొటోస్ ఫై మీమ్స్ వేయడం..బ్యాక్ గ్రౌండ్ ఐటెం సాంగ్స్ జోడించడం వంటివి చేస్తూ వస్తున్నారు. గత మూడు రోజులుగా సోషల్ మీడియా లో ఇవే చక్కర్లు కొడుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
దీనిపై హసీనా ఆవేదన వ్యక్తం చేసారు. 2005 నుండి TV9తో కలిసి పని చేస్తున్నాను. టీడీపీకి సరైన కవరేజీని అందించడం లేదని ఆ పార్టీ మద్దతుదారులలో ఓ రకమైన భావన ఉంది, దాని కారణంగా వారు నన్ను టార్గెట్ చేస్తున్నారు. మా ఛానెల్ కవరేజ్ పక్షపాతంగా ఉందని వారు భావిస్తే, వారు దానిని మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుకోవచ్చు.. నేను స్త్రీని అనే వాస్తవాన్ని కూడా పరిగణించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని , గతంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నో అంశాలపై కూడా నివేదికలు అందించానని.. కేదార్‌నాథ్ వరదలు, ఉక్రెయిన్ యుద్ధం వంటి చాలా సమస్యలపై కూడా నివేదించాను. ఇప్పటి వరకూ నా కవరేజీలో ఏ ఒక్క పార్టీకి మద్దతు ఇవ్వలేదని హసీనా చెప్పుకొచ్చారు.
పండగ సందర్భంగా జరిగే వేడుకలను కవర్ చేసేందుకు వెళ్లే ఛానల్ ఉద్యోగిపై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆమెకు ఒక కుటుంబం ఉంటుంది, ఆమెకు వ్యక్తిగత జీవితం ఉంటుంది.. ఇలాంటి ఆరోపణలు చేస్తే రేపటినాడు ఆమె పరిస్థితి ఏమిటి? ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లి పరిస్థితులను కవర్ చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్టు ఆమె. అలాంటి మహిళ మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని యావత్ ప్రజలు మండిపడుతున్నారు.
సోషల్ మీడియా లో హసీనా ఫై జరుగుతున్నా ట్రోల్స్ ఫై నెట్‌వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా, ఇండియా (NWMI) ఖండించింది. సీనియర్ జర్నలిస్ట్ హసీనా ఫై ఓ పార్టీ మద్దతుదారులు ఇలాంటి ట్రోల్స్ చేయడం మంచిది కాదని, తక్షణమే వీటిని ఆపాలని హెచ్చరించింది. హసీనా కు తమ సపోర్ట్ ఎప్పటికి ఉంటుందని NWMI తెలిపింది. ఇలాంటివి ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని..ఆలా చేయని పక్షాన మరింత వేధింపులకు , దాడులకు పాల్పడతారని సూచించింది. జర్నలిస్టుల నోరు మూయించేందుకు ప్రయత్నించే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ఇటువంటి ట్రోలింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరియు అరికట్టడానికి ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరింది. బాధ్యతాయుతమైన నాయకులుగా, రాజకీయ పార్టీలు మహిళా జర్నలిస్టులపై ఈ రకమైన వేధింపులకు పాల్పడకుండా తమ సోషల్ మీడియా సెల్‌లు మరియు మద్దతుదారులను హెచ్చరించాలని కోరింది. మహిళా జర్నలిస్టుల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ, స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగ ప్రకటనలు విడుదల చేయాలని టీడీపీ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చింది.
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బైక్ పై టీవీ9 రిపోర్టర్ హసీనా…#kodalinani #gudivada #ycp #haseena #tv9 pic.twitter.com/h1AzFg4Upz
— C L N Raju (@clnraju) January 13, 2024
Read Also : Komatireddy: ఆడబిడ్డలకు తులం బంగారం పంపిణీపై నిర్ణయం తీసుకుంటాం: కోమటిరెడ్డి