HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Stampede In Kashi Bugga Cm Chandrababu Is Extremely Angry Over The Actions Of Private Individuals

CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. ప్రైవేటు వ్యక్తుల చర్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

కాశీబుగ్గ దుర్ఘటన నేపథ్యంలో పండుగలు లేదా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు తప్పనిసరిగా పోలీసుల నుండి ముందస్తు అనుమతులు, భద్రతా ప్రణాళికలను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

  • By Gopichand Published Date - 03:34 PM, Sat - 1 November 25
  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

CM Chandrababu: శ్రీ సత్యసాయి జిల్లాలోని పెద్దన్నవారిపల్లిలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజావేదికకు హాజరైన ప్రజలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ముందస్తు ప్రణాళిక లేకపోవడంపై సీఎం విచారం వ్య‌క్తం చేశారు. ఈ దుర్ఘటనపై మాట్లాడిన సీఎం తుపాను వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ముందస్తు ప్రణాళిక ద్వారా తాము ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా చూడగలిగామని గుర్తు చేశారు. అలాంటిది ఈ తొక్కిసలాటలో ఇంతమంది మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఆలయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం చాలా విచారకరం. ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే భక్తులను క్యూలైన్లలో నియంత్రించేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు అవకాశం ఉండేది” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ మళ్లీ ఎలా ఫిట్‌గా అయ్యాడో తెలుసా?

ప్రైవేటు వ్యక్తుల చర్యలపై ఆగ్రహం

ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటే కొందరు ప్రైవేటు వ్యక్తులు సరైన అనుమతులు, ప్రణాళిక లేకుండా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఈ తరహా తొక్కిసలాట దుర్ఘటనలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై సీరియస్‌గా వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధ్యులను తక్షణం కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినమైన నిబంధనలు, చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

కాశీబుగ్గ దుర్ఘటన నేపథ్యంలో పండుగలు లేదా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు తప్పనిసరిగా పోలీసుల నుండి ముందస్తు అనుమతులు, భద్రతా ప్రణాళికలను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ ఘటన రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లు, గుంపు నియంత్రణ విషయంలో మరింత అప్రమత్తత అవసరాన్ని నొక్కి చెప్పింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • CM Chandrababu
  • Kashibugga
  • telugu news
  • Venkateswara Swamy Temple

Related News

Stampede Incidents Kashibug

2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

2025 Stampede incidents In India: దేశవ్యాప్తంగా తొక్కిసలాట ఘటనలు (Stampede Incidents) ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రజా కార్యక్రమాలు, పండుగలు, మత యాత్రలు, రాజకీయ సభలు వంటి సందర్భాల్లో ప్రజల అధిక సంఖ్యలో

  • Stampede In Srikakulam Kasi

    Srikakulam Temple Stampede: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

  • Ap House Land Is Now Yours

    AP Govt Good News : రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం చంద్రబాబు

  • Ap Swarnandhra Centers

    Swarnandhra Centers : మరో మార్పు దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు

  • MP Chamala

    MP Chamala: మైనార్టీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ విద్వేషం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Latest News

  • India Womens WC Winner: భారత మహిళల చారిత్రాత్మక విజయం – తొలి వనితల వరల్డ్ కప్ టీమిండియాదే

  • Unclaimed Bank Deposits: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీకోస‌మే!

  • Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి!

  • Headache: మైగ్రేన్, తలనొప్పి స‌మ‌స్య వేధిస్తుందా? అయితే ఈ పొర‌పాట్లు చేయ‌కండి!

  • South Africa: భార‌త్ నిర్దేశించిన 299 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సౌతాఫ్రికా సాధించ‌గ‌ల‌దా?

Trending News

    • LVM3-M5 Launch : నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5(బాహుబలి) రాకెట్

    • IND-W vs SA-W Final: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే టైటిల్ ఎవరికి?

    • 21st Installment: 11 కోట్ల మందికి శుభవార్త‌.. ఖాతాల్లోకి రూ. 2 వేలు?!

    • Hydraa : పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం..ఇదే హైడ్రా తీరు – కేటీఆర్

    • Sanju Samson: ఐపీఎల్ 2026 మెగా వేలం.. ఢిల్లీలోకి సంజు శాంస‌న్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd