SSC Exams : రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈరోజు (ఏప్రిల్ 3న) ప్రారంభం కానున్న
- Author : Prasad
Date : 03-04-2023 - 8:02 IST
Published By : Hashtagu Telugu Desk
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈరోజు (ఏప్రిల్ 3న) ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి బోర్డు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది. పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో జరుగుతాయని ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది. విద్యార్థులు తమ AP SSC హాల్ టికెట్ 2023ని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలని… AP SSC పరీక్ష టైమ్ టేబుల్ 2023 ప్రకారం పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వరకు నిర్వహించనున్నారు. టైమ్ టేబుల్ ప్రకారం, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష ఏప్రిల్ 3న ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 3349 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 6.6 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.
ఇటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరగనుందని, విద్యార్థులను 9.35 వరకు పరీక్ష గదిలోకి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. ఈసారి కూడా 6పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.