AP CEO: సీఈవో ఎదుట పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు హాజరు
- Author : Latha Suma
Date : 21-03-2024 - 5:19 IST
Published By : Hashtagu Telugu Desk
AP CEO: ఏపీ(AP)లో ఈ నెల 16 నుంచి ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోడ్ వచ్చిన తర్వాత ఆళ్లగడ్డ, గిద్దలూరులో రెండు హత్యలు జరగ్గా, ఇవి రాజకీయ హత్యలంటూ విపక్షాలు భగ్గుమన్నాయి. మాచర్లలో ఓ పార్టీకి చెందిన కారును తగలబెట్టడం మరింత కాకరేపింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ పరిణామాలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హింసను ఎందుకు ఆపలేకపోయారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా మూడు జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలను తన ఎదుట హాజరు కావాలని స్పష్టం చేశారు.
read also: Sodium: మన శరీరంలో సోడియం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
ఈ క్రమంలో, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి నేడు ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఎదుట హాజరయ్యారు. ఆయా ఘటనలపై ఎస్పీలు ఇచ్చే వివరణ ఆధారంగా సీఈవో చర్యలు తీసుకోనున్నారు. ఎస్పీల వివరణ సంతృప్తికరంగా లేకపోతే వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది.