HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Special Story On Janasena Party Violence In Visakhapatnam

Janasena : అజ్ఞాత‌వాపు, గ‌ట్టుత‌ప్పిన‌ జ‌న‌సైన్యం!

`మీరు క్ర‌మ‌శిక్ష‌ణ‌లో లేరు. అలా ఉంటే ప్ర‌జ‌లు న‌మ్మరు` ఇదీ ఒకానొక స‌మ‌యంలో ప‌వ‌న్ క్యాడ‌ర్ కు చెప్పిన మాట‌లు. ఆ వీడియో సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. దానికి కార‌ణంగా విశాఖ కేంద్రంగా ఈనెల 15వ తేదీన జ‌రిగిన సంఘ‌ట‌న‌.

  • Author : CS Rao Date : 17-10-2022 - 1:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nagababu Pawan Kalyan
Nagababu Pawan Kalyan

`మీరు క్ర‌మ‌శిక్ష‌ణ‌లో లేరు. అలా ఉంటే ప్ర‌జ‌లు న‌మ్మరు` ఇదీ ఒకానొక స‌మ‌యంలో ప‌వ‌న్ క్యాడ‌ర్ కు చెప్పిన మాట‌లు. ఆ వీడియో సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. దానికి కార‌ణంగా విశాఖ కేంద్రంగా ఈనెల 15వ తేదీన జ‌రిగిన సంఘ‌ట‌న‌. మంత్రుల‌పై రాళ్ల దాడి చేసిన జ‌న సైనికులు, ఆ త‌రువాత మీడియా, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆ పార్టీ నాయ‌కులు వాడుతోన్న ప‌ద‌జాలం గ‌మ‌నిస్తే ఏపీ ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న క‌ల‌గ‌డం స‌హ‌జం.

మూడు రాజ‌ధానుల అంశాన్ని రాజ‌కీయంగా వైసీపీ బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. మ‌హాపాద‌యాత్ర కు కౌంట‌ర్ గా ఆ పార్టీ గ‌ర్జ‌న‌కు పిలుపునిచ్చిన విష‌యం విదిత‌మే. ఒక వైపు అమ‌రావ‌తి టూ అర‌స‌వెల్లి మహాపాద‌యాత్ర టెన్ష‌న్ మ‌ధ్య సాగుతోంది. హైకోర్టు ఆదేశాల మేర‌కు కొన్ని ఆంక్ష‌ల న‌డుమ ముందుకు వెళుతోంది. ఆ క్ర‌మంలో ఎక్క‌డికక్క‌డ పోలీసులు భారీ బందోబ‌స్తు పెట్టారు. ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు యాత్ర ప్ర‌వేశించే స‌మ‌యానికి మ‌రింత ఉద్రిక్తత నెల‌కొంది. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ కూడా విశాఖ, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకున్నారు.

స‌హ‌జంగా ప్రాంతాల మ‌ధ్య వైరుధ్యం ఏపీలో ఉంది. కానీ, రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ఉద్య‌మాలు ఒక‌ప్పుడు నడిచాయి. ఆ త‌రువాత స‌మ‌సి పోయిన‌ప్ప‌టికీ ఉమ్మ‌డి ఏపీ విడిపోయిన త‌రువాత నివురుగ‌ప్పిన నిప్పులా ఇష్యూ ఉంది. దాన్ని రాజ‌కీయ అస్త్రంగా మ‌లుచుకోవ‌డానికి వైసీపీ బ‌య‌ట‌కు తీసింది. ఫ‌లితంగా సున్నిత‌మైన అంశం ఏపీని వెంటాడుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆచితూచి అడుగువేయాల్సిన రాజ‌కీయ పార్టీలు ఎవ‌రికివారే ఉత్త‌రాంధ్ర వైపు మ‌ళ్లారు. ఆ విష‌యం ప‌వ‌న్ దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో పరిస్థితి అదుపు త‌ప్పింది.

Also Watch :

గ‌తంలోనూ మెగా అభిమానులు, జ‌న‌సైన్యంకు దాడులు చేసిన సంస్కృతి ఉంది. హీరో రాజ‌శేఖ‌ర్ కుటుంబం వెళుతోన్న కారును వెంబ‌డించి భ‌యాన‌క వాతావార‌ణాన్ని ఒక‌ప్పుడు సృస్టించారు. ఆ త‌రువాత సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి, క‌త్తి మ‌హేష్ లాంటి వాళ్ల‌పై బూతుల‌తో యుద్ధం చేశారు. తాజాగా వైసీపీ లీడ‌ర్‌, సినీ న‌టుడు పోసాని ముర‌ళీకృష్ణ ఇంటి మీద దాడికి దిగారు. ఇదంతా చూస్తుంటే, రాబోవు రోజుల్లో ప‌వ‌న్ ఏది చెబితే ఏపీ ప్ర‌జ‌లు అది వినాల‌న్న‌ట్టు జ‌న‌సైన్యం ఉవాచ‌గా ఉంది. అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా అధికారంలోని వైసీపీ ప్ర‌త్య‌ర్థుల ఇళ్ల‌పై దాడులు, పార్టీ ఆఫీస్ ల‌ను ధ్వంసం చేస్తూ భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేసింది.

వైజాగ్ వెళ్లిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ను వెళ్లిపోవాల‌ని పోలీసులు నోటీసులు ఇచ్చే వ‌ర‌కు వ్య‌వ‌హారం వెళ్లింది. ఈనెల 15న జ‌రిగిన వైసీపీ గ‌ర్జ‌న్, ప‌వ‌న్ హడావుడి రాష్ట్రంలో రాబోవు ఎన్నిక‌ల నాటికి ఏమి జ‌ర‌గ‌బోతుందో సూచాయ‌గా ప్ర‌జ‌ల‌కు సంకేతాలు ఇచ్చారు. గుర్తింపు కూడా లేని జన‌సేన దూకుడును చూసి సామాన్య‌లు సైతం నోరు వెళ్ల‌బెడుతున్నారు. ఆ పార్టీకి చెందిన లీడ‌ర్లు వాడే బూతు ప‌ద‌జాలం, జ‌న‌సైన్యం హ‌ల్ చ‌ల్ గ‌మ‌నిస్తే క్ర‌మ‌శిక్ష‌ణ ఏ మాత్రం లేద‌ని బోధ‌ప‌డుతుంది. అందుకేనోమో ప‌క్ర‌మ‌శిక్ష‌ణ లేకపోతే ప్ర‌జ‌లు ప‌వ‌న్ హిత‌బోధ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • Janasena
  • Pawan Kalyan
  • Visakhapatnam

Related News

Mehar Ramesh Event

Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

మెహర్ రమేష్ కుమార్తెకు, తోట చంద్రశేఖర్ కుమారుడితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్‌లో వీరి నిశ్చయ తాంబూలాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

    Latest News

    • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

    • Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

    • GST : ఏప్రిల్ GST వసూళ్లలో రికార్డ్

    • Soap & Shampoo Price : సామాన్య ప్రజలపై మరో పిడుగు..భారీగా పెరిగిన సబ్బులు, షాంపూల ధరలు

    • Balayya : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య-కొరటాల కాంబో ఫిక్స్

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd