Somireddy Chandramohan Reddy : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అరెస్ట్
- By Sudheer Published Date - 12:28 PM, Tue - 19 December 23

అక్రమ మైనింగ్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి , ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామ సమీపంలోని రుస్తుం, భారత్ మైన్ లో జరుగుతున్న అవీనీతి అక్రమాలపై గత నాల్గు రోజులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. శాంతియుతంగా చంద్రమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సోమిరెడ్డిని బలవంతంగా తీసుకెళ్లి ఆయన ఇంటి వద్ద దించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సమయంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు పోలీసులకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిసెంబర్ 18న భారీ సంఖ్యలో హిజ్రాలు సోమిరెడ్డి దీక్ష శిబిరం వద్దకు వచ్చి దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు దీక్షను విరమించాలని సోమిరెడ్డిని కోరారు. అక్రమ మైనింగ్ పై కోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ చేస్తేనే దీక్షను విరమిస్తానని సోమి రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో శిబిరం వద్ద ఉండేందుకు నలుగురికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చినప్పటికీ డిసెంబర్ 19 తెల్లవారుజామున 2 గంటలకు భారీ సంఖ్యలో పోలీసులు దీక్ష శిబిరం వద్దకు చేరుకొని, సోమిరెడ్డిని బలవంతంగా జీప్ లోకి ఎక్కించారు.
Read Also : Hanu-Man Trailer: హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది.. అంజనాద్రి లోకం అద్భుతం!