HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sirajur Rahman From Vizianagaram Came To Hyderabad For Group 2 Coaching Turned To Terrorism

Hyderabad Blasts Plan : గ్రూప్‌ 2 కోచింగ్‌ కోసం వచ్చి.. ఉగ్రవాదం వైపు మళ్లిన యువకుడు

విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్‌(Hyderabad Blasts Plan) పూర్తి పేరు సిరాజుర్ రహ్మాన్.

  • Author : Pasha Date : 19-05-2025 - 2:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Blasts Plan Sirajur Rahman Vizianagaram Hyderabad Group 2 Coaching Terrorism

Hyderabad Blasts Plan : ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్‌, తెలంగాణలోని సికింద్రాబాద్‌ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్‌ల అరెస్టు వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఇద్దరూ కలిసి హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నారని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్నాయి.  తాజా అప్‌డేట్స్‌ను ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Yusuf Pathan : అఖిల పక్ష బృందం నుంచి పఠాన్ ఔట్.. టీఎంసీ సంచలన నిర్ణయం

సిరాజ్ నేపథ్యం.. గ్రూప్ 2 కోచింగ్.. 

  • విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్‌(Hyderabad Blasts Plan) పూర్తి పేరు సిరాజుర్ రహ్మాన్.
  • సిరాజ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
  • సిరాజ్‌ తండ్రి ఏపీ పోలీసు శాఖలో  ఏఎస్సై. అతడి సోదరుడు కానిస్టేబుల్‌.
  • సిరాజ్‌‌ను కూడా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేర్పించాలని అతడి తండ్రి భావించారు.
  • గ్రూప్‌ 2 పరీక్షల కోచింగ్ కోసం హైదరాబాద్‌‌కు సిరాజ్‌ను పంపారు.
  • హైదరాబాద్‌లో ఉండగా సోషల్ మీడియాలో సిరాజ్ బిజీ అయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నాడు.
  • ఈక్రమంలోనే సౌదీ అరేబియాలో ఉంటున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ఒకరితో సిరాజ్‌కు పరిచయం ఏర్పడింది.
  • ఇదే వ్యవధిలో సికింద్రాబాద్‌ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్‌‌తోనూ సిరాజ్‌కు స్నేహం ఏర్పడింది. ఈ ఇద్దరూ కలిసి ఐసిస్ హ్యాండ్లర్‌కు దగ్గరయ్యారు.
  • అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పేరిట సంస్థను సిరాజ్ ఏర్పాటు చేయగా, అందులో సభ్యుడిగా సమీర్ చేరినట్లు పోలీసులు చెబుతున్నారు.
  • హైదరాబాద్‌లో  గ్రూప్‌ 2 కోచింగ్‌‌ను సిరాజ్ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత విజయనగరానికి తిరిగి వెళ్లిపోయాడు.
  • విజయనగరంలో నుంచే సౌదీ అరేబియాలో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్‌తో సిరాజ్ సంప్రదింపులు జరిపాడు.  సికింద్రాబాద్‌లో ఉన్న సమీర్‌తోనూ టచ్‌లో ఉన్నాడు.
  • ఐసిస్ హ్యాండ్లర్ సలహాల మేరకు పేలుడు పదార్ధాల తయారీకి అవసరమైన కెమికల్స్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చాడు. వాటిని తన ఇంటికి తెప్పించుకున్నాడు.
  • సిరాజ్ తెప్పించుకున్న రసాయనాల జాబితాలో పొటాషియం క్లోరేట్, సల్ఫర్ వంటివి ఉన్నాయి.
  • ఈ రసాయనాలతో బాంబులు తయారుచేసి మే 21, 22 తేదీల్లో విజయనగరంలో పేలుళ్ల రీహార్సల్ చేయాలని సిరాజ్, సమీర్ నిర్ణయించారు.
  • పేలుడు పదార్థాల కోసం సిరాజ్ ఆన్‌లైన్ ఆర్డర్ ఇచ్చాక.. భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది.  అక్కడి నుంచి తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగానికి, వారి నుంచి ఏపీ పోలీస్ ఇంటెలీజెన్స్ విభాగానికి సమాచారం చేరింది.
  • ఆ వెంటనే శనివారం రోజు (మే 17న) విజయనగరంలో ఉన్న సిరాజ్ ఇంటిపై పోలీసులు రైడ్స్ చేశారు. పేలుడు పదార్థాల తయారీకి వాడే కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
  •  తదుపరిగా ఏపీ, తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగాల అధికారులు సికింద్రాబాద్‌లో సమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
  • ట్రాన్సిట్ వారంట్‌పై సమీర్‌ను హైదరాబాద్ నుంచి విజయనగరానికి తరలించారు.
  • సిరాజ్‌, సమీర్‌లకు విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Also Read :Mysore Rajamata : తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత భారీ విరాళం.. ప్రమోదాదేవి గురించి తెలుసా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • crime
  • Group 2 Coaching
  • hyderabad
  • Hyderabad Blasts Plan
  • sirajur rahman
  • telangana
  • terrorism
  • vijayanagaram
  • Vizianagaram

Related News

Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

Nara Lokesh లక్షల హృదయాల ప్రార్థనలు ఓవైపు, మంత్రి నారా లోకేశ్ కృషి మరోవైపు… అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాన్ని నిలబెట్టాయి. కొన్ని నెలలుగా ‘సేవ్ పునర్విక’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సాగిన మానవతా ఉద్యమానికి సార్థకత లభించింది. ఆ పసిమొగ్గకు ప్రాణం నిలిచింది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA టైప్-1) వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఏడాది చిన్నారి పునర

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Radisson Blu 5-star property set to enter the City of Bulls Ongole

    Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

Latest News

  • Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

  • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

Trending News

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd