HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Shutdown The I Pac Service Ycp Leaders Rebellion Against Jagan

I-PAC Service: ఐ ప్యాక్‌ని `పీకే`యండి.. జగన్‌పై వైసీపీ నేతల తిరుగుబాటు!

ఐ ప్యాక్‌ హెడ్‌గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఉన్న సమయంలో ఆయనే జగన్‌కి గైడ్‌గా వ్యవహరించేవారు.. ఆయన అక్కడ నుండి తప్పుకున్న తర్వాత, ఆ బాధ్యతలను కొత్త టీమ్‌ తీసుకుంది.

  • Author : Gopi Date : 22-02-2025 - 4:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan
Ys Jagan

I-PAC Service: ఐ ప్యాక్‌… 2019లో వైసీపీ విజయానికి ఎంతటి కీలక పాత్ర పోషించిందో, 2024లో జగన్‌ ఓటమికి దాని బాధ్యత కూడా అంతే ఉందని చెబుతారు రాజకీయ పరిశీలకులు.. జగన్‌కి కర్త, కర్మ, క్రియలా మారి, ఆయన అడుగడుగుని, ప్రచార బాధ్యతలని, స్పీచ్‌లని నిర్ణయించేంది ఐ ప్యాక్‌ అనే ప్రచారం ఉంది.. ఈ ఐ ప్యాక్‌ని తొలగించాలని, జగన్‌ ప్రజలకు దగ్గర కావాలంటే, ఆయన పొలిటికల్‌ గ్రాఫ్‌ పెరగాలంటే, ఐ ప్యాక్‌ని తాడేపల్లి ప్యాలెస్‌ నుండి పంపించేయాలని మండిపడుతున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఐ ప్యాక్‌ వ్యూహాలు జగన్‌కి గుదిబండలా మారుతున్నాయని, ఆయన ఇమేజ్‌ని తగ్గిస్తున్నాయని అభిప్రాయ పడుతున్నారు..

ఐ ప్యాక్‌ హెడ్‌గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఉన్న సమయంలో ఆయనే జగన్‌కి గైడ్‌గా వ్యవహరించేవారు.. ఆయన అక్కడ నుండి తప్పుకున్న తర్వాత, ఆ బాధ్యతలను కొత్త టీమ్‌ తీసుకుంది.. ఈ టీమ్‌.. వినూత్న విధానాలను, కొత్త ఆలోచనలను, వ్యూహాలను అనుసరించడం లేదని, ఫెయిల్‌ అయిన రాంగ్‌ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.. ఇవి జగన్‌కి మైలేజ్‌ తీసుకురాకపోగా, నెగిటివ్‌గా మారుతున్నాయని వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు..

Also Read: Minister Uttam Kumar Reddy: ప్ర‌మాద స్థ‌లానికి మంత్రులు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తమ్, జూపల్లి

ఇటీవల వైసీపీ అధినేత జగన్‌…. జైలులో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చారు.. అక్కడ ఐ ప్యాక్‌ ప్రీ ప్లాన్‌గా క్రియేట్‌ చేసిన సీన్‌ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలనే విస్మయానికి గురి చేసింది.. ఓ పదేళ్ల స్కూల్‌ బాలికని జగన్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టిన ప్రదేశానికి తీసుకువచ్చి ఒక సెల్ఫీ కావాలని ఏడుపులు, పెడబొబ్బలు పెట్టేలా సీన్‌ క్రియేట్ చేశారు.. ఆ తరవాత ఆ పాపతో అమ్మ ఒడి పథకాన్ని చంద్రబాబు సర్కార్‌ అమలు చేయడం లేదని విమర్శలు చేయించారు.. తీరా చూస్తే ఆ పాప వైసీపీకి చెందిన ఓ నేత కూతురు.. ఆమె ఇంటర్‌ నేషనల్‌ స్కూల్‌లో చదువుతోంది.. ఆ పాప తండ్రికి బంగారం షాప్‌ ఉందని సోషల్‌ మీడియాలో కథనాలు వచ్చాయి.. దీంతో, ఎంతో పాజిటివ్‌ అనుకున్న ఈ ప్లాన్‌ బెడిసి కొట్టింది.. పాప వీడియో బూమరాంగ్‌ అయింది..

ఆ పాప వీడియోపై సోషల్‌ మీడియాలో భారీగా ట్రోలింగ్‌ అయింది.. వైసీపీ ప్రత్యర్ధులకి ఈ వీడియో ఒక వరంలా మారింది.. జగన్‌ని నియంతృత్వ, ఫ్యూడల్ పోకడలకి ఇది నిదర్శనం అని సామాజిక కార్యకర్తలు సైతం దుమ్మెత్తి పోశారు.. వైసీపీ అధినేత మనస్తత్వం ఒక ఫ్యాక్షనిస్టుని తలపిస్తోందని అభిప్రాయ పడ్డారు.. దీంతో, జగన్‌కి కలిసి వస్తుందని ఆశించిన ప్లానింగ్‌ గతి తప్పడంతో, దీనిపై వైసీపీ సోషల్‌ మీడియా కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది.. ఈ ఐడియా ఇచ్చిన ఐ ప్యాక్‌ని వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.. 2024 ఎన్నికలకు ముందు ఇలాంటి వీడియోలతోనే వైసీపీకిభారీ నష్టం జరిగిందని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు.. దీంతో, వెంటనే ఐ ప్యాక్‌కి ప్యాకప్‌ చేయాలని చెబుతున్నారు.. మరి, జగన్‌ టీమ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap politics
  • I Pac
  • ys jagan
  • YSR Congress Party

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • It is because of CM Chandrababu that it is not raining: Former Minister

    Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

  • YS Jagan pays tribute to YSR.

    YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd