AP DSC Notification : జగనన్న “దగా డీఎస్సీ” ఇచ్చారు – షర్మిల
- Author : Sudheer
Date : 13-02-2024 - 4:19 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..తన అన్న, సీఎం జగన్ (CM Jagan)విషయం లో ఎక్కడ తగ్గడం లేదు..రోజు రోజుకు తన విమర్శలు పెంచడమే కానీ తగ్గేదేలే అంటుంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన రోజు నుండే తన దూకుడు ను కనపరుస్తూ అధికార నేతల్లో చెమటలు పట్టిస్తుంది. ఏ వేదికను వదిలిపెట్టకుండా జగన్ ఫై నిప్పులు చెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాల పర్యటన లో బిజీ గా ఉన్న షర్మిల..జగన్ ‘డీఎస్సీ’ నోటిఫికేషన్ ఫై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.
‘‘మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. వారసుడిగా చెప్పుకొనే జగన్ అన్న 6 వేలతో వేసింది “దగా డీఎస్సీ”. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నాయకులు.. వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ? 5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు? ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి? టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి? నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా? టెట్ కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మద్య కేవలం 6 రోజుల వ్యవధా? వైఎస్ఆర్ హాయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా..? ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా? రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా? మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా? నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ ఆన్న.. ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె నిన్న రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy To) తో షర్మిల భేటీ అయ్యారు. తెలంగాణలో కృష్ణా జలాల అంశం(Krishna Water Issue)పై తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో అనూహ్యంగా షర్మిల..సీఎం రేవంత్ ను కలవడం ఆసక్తి రేపింది. కృష్ణా జలాలను కేసీఆర్ ఏపీకి తరలించారని.. నాడు సీఎం జగన్‌కు మాటిచ్చారని పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డితో షర్మిల సమావేశం కావడం విశేషం. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డిని కలిసినట్లు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా వెల్లడించారు.
మహానేత YSR 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే…వారసుడు గా చెప్పుకొనే జగన్ ఆన్న 6 వేలతో వేసింది "దగా డీఎస్సీ".ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే YCP నాయకులు,వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్.
1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ ?
2. 5 ఏళ్లు…— YS Sharmila (@realyssharmila) February 13, 2024
Read Also : SSMB 29 : మహేష్ – రాజమౌళి మూవీ టెక్నికల్ టీమ్ వీరే..!!