AP: శబరి ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ముప్పు..!!
- By hashtagu Published Date - 09:47 AM, Tue - 1 November 22

ఏపీలోని గుంటూరు జిల్లాలో శబరి ఎక్స్ ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు రైలు పట్టాలపై అడ్డంగా ఇనుపరాడ్డును కట్టారు. అనుమానం రాకుండా చుట్టూ అట్టముక్కలను పెట్టారు. ఆ సమయంలో సికింద్రాబాద్ త్రివేండ్రం శబరి ఎక్స్ ప్రెస్ రైలు వెళ్లాల్సి ఉంది. పట్టాలపై ఇనుపరాడ్డును గమనించిన లోకోపైలెట్ మంజునాథ్ వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఇంజనీరింగ్ సిబ్బంది సాయంతో లోకోపైలెట్ రాడ్డును తొలగించారు. ఇది ఆకతాయిలు చేసిన పనికాదని…. ప్లాన్ ప్రకారమే దుండగులు చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన పై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాడ్డును గమనించక రైలు వెళ్తే… మంటలు వ్యాపించే ప్రమాదం ఉండేదని అధికారులు చెబతున్నారు.