HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rs 10 Lakh Crore Investment For Ap Cm Chandrababu

Green Energy : ఏపీకి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంపడ్‌ స్టోరేజ్ విద్యుత్‌ను పూడిమాడకకు తెస్తే వాటి ద్వారా హెడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఉత్పత్తయ్యే హైడ్రోజన్‌తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని అన్నారు.

  • Author : Latha Suma Date : 11-01-2025 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rs.10 lakh crore investment for AP: CM Chandrababu

Green Energy : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రానికి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుందని అన్నారు. మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంపడ్‌ స్టోరేజ్ విద్యుత్‌ను పూడిమాడకకు తెస్తే వాటి ద్వారా హెడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఉత్పత్తయ్యే హైడ్రోజన్‌తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని అన్నారు.

గ్రీన్ కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ను టెకోవర్ చేసి గ్రీన్ ఆమ్మోనియాను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఈ ప్లాంట్ మీద 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతులు జరుగుతాయి. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్సెడ్ గ్యాస్ తయారీకి 500కేంద్రాలు పెడుతోంది. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఎగుమతులు పెరిగి మనకి లాభం వస్తుంది. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తుల కి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుంది. ఎన్టీపీసీ లో బొగ్గు మండించటం ద్వారా వచ్చే కార్బన్ డయాక్సైడ్ ని పూడిమడక తెచ్చి హైడ్రోజన్ ఉత్పత్తి కి వాడితే కాలుష్యం తగ్గుతుంది.

బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ స్వాపింగ్ బ్యాటరీలు మోడల్‌ను కుప్పంకి తెచ్చిందన్నారు. కుప్పంలో సూర్యఘర్ అమల్లో ఉన్న ఇళ్లకు స్వాపింగ్ బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకునేందుకు ఇంటి యజమానికి డబ్బులు చెల్లిస్తుందని అన్నారు. ఇది కుప్పం సూర్యఘర్ ఇంటి వాసులకు అదనపు ఆదాయం కానుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్సెడ్ గ్యాస్ తయారీకి 500కేంద్రాలు పెడుతోందని వివరించారు. ఒక్కో కేంద్రం రూ.130కోట్ల పెట్టుబడి పెడుతున్నారని చెప్పారు. బయోగ్యాస్‌కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతుందని తెలిపారు. ఈ గడ్డి పెంచటానికి ఎకరాకు రూ.30వేల కౌలు రైతులకు రిలయన్స్ చెల్లిస్తుందన్నారు. ఈ కేంద్రాల వల్ల ఉద్యోగాలు వచ్చి, గ్యాస్ ఉత్పత్తిలో వచ్చే వ్యర్థాలు భూసారం పెంచేందుకు ఎరువు గానూ ఉపయోగపడుతుందని చెప్పారు.

పిల్లల్లో సృజనాత్మకత పెంచటానికి యాప్‌ల సాయంతో శిక్షణ ఇస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం అని సీఎం అన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్నాం. మిగిలిన వారికి కూడా సౌర ఫలకాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ రాయితీ పోను మిగిలిన ఫలకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చే వరకూ కొంత మొత్తం విద్యుత్ వెనక్కి తీసుకుంటాం. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చాక యూనిట్ మొత్తం ఇంటి యజమానికి అప్పగిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Read Also: Pawan Kalyan : రూ.10 లక్షల పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా ?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Green Co Company
  • Green Energy
  • Investments
  • Suryagarh

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd