HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rk Roja Reaction On Supreme Court Decision On Tirupati Laddu Issue

RK Roja Reaction: సుప్రీంకోర్టు తీర్పుపై మ‌రోసారి స్పందించిన రోజా.. చంద్ర‌బాబే తొంద‌రుప‌డ్డారు..!

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్‌ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ జరిగితే అది తీవ్రమైన అంశమని.. అందుకే దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపితే మంచిదన్నారు.

  • Author : Gopi Date : 04-10-2024 - 12:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
RK Roja Reaction
RK Roja Reaction

RK Roja Reaction: తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మాజీ మంత్రి రోజా (RK Roja Reaction) త‌న ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. “శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాల వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. సుప్రీం తీర్పుతో అయినా సున్నిత‌మైన భ‌క్తుల మ‌నోభావాల‌తో కూడుకున్న శ్రీ‌వారి ప్ర‌సాదాల విష‌యంలో రాజ‌కీయ దురుద్దేశ‌పూరిత వ్యాఖ్య‌లు అంద‌రూ మానుకుంటే మంచిది. మొద‌టి నుంచి మేము భావిస్తున్న‌ది రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే విచార‌ణ‌, ఆధారాల‌తో సంబంధం లేకుండా రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో వారి ప‌రిధిలోని విచార‌ణ‌తో నిజాలు బ‌య‌టికి రావ‌ని స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ కావాల‌ని కోరుకున్నాం. కేంద్ర ప్ర‌భుత్వం కూడా సిట్ స‌రిపోద‌ని, కేంద్ర ప్ర‌భుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ జ‌ర‌గాల‌నే వాద‌న‌తో మా డిమాండ్‌కు విశ్వ‌స‌నీయ‌త పెరిగింది. సుప్రీం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స్వ‌తంత్ర ద‌ర్యాప్తుతో వాస్త‌వాలు బ‌య‌టికి వ‌స్తాయ‌ని, త‌ద్వారా గాయ‌ప‌డిన కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల్ని పున‌రుద్ధ‌రించిన‌ట్టు అవుతుంద‌ని తిరుప‌తి ఆడ‌బిడ్డ‌గా న‌మ్ముతున్నాను” అని ఆమె ట్వీట్ చేశారు.

Also Read: Car Buyers: పాత కార్ల‌కు చెక్ పెట్టేందుకు కొత్త ఆఫ‌ర్‌.. ఏంటంటే..?

శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాల వివాదంలో #SupremeCourt తీర్పు ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. సుప్రీం తీర్పుతో అయినా సున్నిత‌మైన భ‌క్తుల మ‌నోభావాల‌తో కూడుకున్న శ్రీ‌వారి ప్ర‌సాదాల విష‌యంలో రాజ‌కీయ దురుద్దేశ‌పూరిత వ్యాఖ్య‌లు అంద‌రూ మానుకుంటే మంచిది. మొద‌టి నుంచి మేము భావిస్తున్న‌ది రాష్ట్ర…

— Roja Selvamani (@RojaSelvamaniRK) October 4, 2024

సుప్రీంకోర్టు తాజా తీర్పు

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్‌ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ జరిగితే అది తీవ్రమైన అంశమని.. అందుకే దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపితే మంచిదన్నారు. స్వతంత్ర సిట్‌ను ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు, Fssai నుంచి ఒకరు ప్రాతినిథ్యం వహించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ల‌డ్డూ విష‌యం రాజ‌కీయం కాకుండా ఉండేందుకు ఈ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కోర్టు తెలిపింది.

తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఆదేశించింది. ఈ దర్యాప్తునకు ఎలాంటి నిర్దిష్ట సమయం సూచించలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివాదంపై రాజకీయ నేతలు మాట్లాడవద్దని సుప్రీం సూచించింది. లడ్డూను రాజకీయం చేయవద్దని కోరింది. సుప్రీం కోర్టు సూచనలతో ఈ వివాదంపై రాజకీయ నేతల నోళ్లు మూతబడినట్లే అని అర్థ‌మ‌వుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • CM Chandrababu
  • RK Roja Reaction
  • SIT
  • Supreme Court
  • Supreme Court Decision
  • Tirupati Laddu
  • tirupati laddu issue

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

    Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

Latest News

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd