Chandrababu Arrest: CBN అరెస్ట్ పై వదినమ్మ మద్దతు.. రోజా కౌంటర్ ఎటాక్
చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసి పదేళ్లకు పైగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బాబుని అరెస్ట్ చేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 09-09-2023 - 4:19 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసి పదేళ్లకు పైగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బాబుని అరెస్ట్ చేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు. టీడీపీ మద్దతుదారులు ఏకమై చంద్రబాబు అరెస్ట్ కేవలం కక్షపూరితమని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, స్వయానా వదిన దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేయకుండా ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదని ఆమె అన్నారు. అయితే పురందేశ్వరికి మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేశారో తెలిపారు. ఇక ఆమె సెక్షన్లతో సహా వివరించారు.
క్రైం నెంబర్ 29/2021 కింద చంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. CRPC 50(1)(2) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారని, 9/12/2021 న సిఐడి EOW వింగ్ FIR నమోదు చేసినట్టు ఆమె ట్వీట్ చేశారు, ఆయనపై పెట్టిన కేసుల విషయానికి వస్తే.. 120(B) నేరపూరితకుట్ర, సెక్షన్ 166,167 పబ్లిక్ సర్వెంట్ చట్టాన్ని ఉల్లంగించి నేరానికి పాల్పడటం, సెక్షన్ 418 తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం, IPC సెక్షన్ 420 మోసం, చీటింగ్, నమ్మక ద్రోహం,IPC సెక్షన్ 465, 468 ఉద్దేశపూర్వకంగా మోసంకోసం ఫోర్జరీ,471 నకిలీ పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డు సృష్టించడం, సెక్షన్ 409 పబ్లిక్ సర్వెంట్ తన ఆధీనంలోని ఆస్థిని అక్రమంగా కట్టబెట్టడం, 12,13(2) అవినీతికి పాల్పడటం, 13(1)(C)(D)పబ్లిక్ సర్వెంట్ అవినీతికి పాల్పడటం ఇలా సెక్షన్లతో సహా ఆమె పేర్కొన్నారు. చంద్రబాబుకి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారన్న పురందేశ్వరికి రోజా ఈ విధంగా సవాల్ విసిరారు. ఇప్పుడు చెప్పండి అంటూ ఆమె ప్రశ్నించారు.
Also Read: Mahesh babu: వామ్మో.. గుంటూరు కారం బడ్జెట్ 150 కోట్లా? మహేశ్ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్