Helicopters : వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు..ఏపీకి 6 హెలికాఫ్టర్లు: కేంద్రం
వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ… సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే రేపటి నుండి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు పాల్గొంటాయి.
- By Latha Suma Published Date - 08:58 PM, Sun - 1 September 24

flooded areas: ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. అనంతరం కేంద్ర హోం సెక్రటరీతో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు రాష్ట్రానికి తెప్పించే అంశంపై చర్చించారు. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లో 25 మంది సిబ్బంది.. ఒక్కో టీమ్ వద్ద నాలుగు పవర్ బోట్లు ఉంటాయి. ఇవన్నీ రేపు ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని తెలిపిన హోం సెక్రటరీ.. మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపారు. వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ… సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే రేపటి నుండి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు పాల్గొంటాయి.
మరోవైపు కుండపోత వర్షాలతో విజయవాడ నగరం నీట మునిగింది. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు వరద ముంపు ప్రాంతాలను బోటులో వెళ్లి పరిశీలించారు. బుడమేరు పొంగి ముంపునకు గురైన సింగ్ నగర్ ప్రాంతానిక వెళ్లి బాధితులను పరామర్శించారు. ఎవరూ అధైర్య పడొద్దని, తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తనను చూసి చేతులూపుతున్న వరద బాధితులను ఉద్దేశించి… ‘మీరేమీ బాధపడొద్దు… అన్నీ నేను చూసుకుంటాను’ అంటూ సంజ్ఞల ద్వారా స్పష్టం చేశారు.
Read Also: Ponnam : ఏదైనా సమాచారం..సహాయం కొరకు ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొన్నం