HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rashmikas Sad Post On Kurnool Bus Accident

Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!

  • By Vamsi Chowdary Korata Published Date - 11:23 AM, Sat - 25 October 25
  • daily-hunt
Kurnool Bus Tragedy
Kurnool Bus Tragedy

కర్నూలు బస్సు ప్రమాద ఘటన అందరినీ కలచి వేస్తోంది. నగర శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వారికి సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. రష్మిక మందన, కిరణ్ అబ్బవరం , సోనూ సూద్ వంటి సినీ ప్రముఖులు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.

కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తగలబడిపోతున్న బస్సులో ప్రయాణికులు అనుభవించిన బాధను తలచుకుంటుంటేనే ఏందో భయంకరంగా ఉందన్నారు. ”కర్నూలు ప్రమాద వార్త నా హృదయాన్ని తీవ్రంగా బాధపెడుతోంది. కాలిపోతున్న బస్సులో ఆ ప్రయాణికులు ఎలాంటి బాధను అనుభవించారనేది ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. చిన్న పిల్లలుతో సహా మొత్తం కుటుంబం నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవడం నన్ను ఎంతో కలచివేస్తోంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని రష్మిక మందన ఎక్స్ లో రాసుకొచ్చారు.

The news from Kurnool has been weighing heavily on my heart. Imagining what those passengers must’ve gone through inside that burning bus is just unbearable..
To think that an entire family, including little kids, and so many others lost their lives in minutes it’s truly…

— Rashmika Mandanna (@iamRashmika) October 24, 2025

”కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దురదృష్టకర సంఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలను తలచుకుంటే నా హృదయం బరువెక్కుతోంది. ఆ కుటుంబాలకి మరింత బలాన్ని ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా” అని కిరణ్‌ అబ్బవరం పోస్ట్ పెట్టారు.

Deeply saddened by the tragic bus accident near Chinnatekur in Kurnool district.

My heart goes out to all the families who lost their loved ones in this unfortunate incident.

Praying for strength to the bereaved and a speedy recovery to the injured. 🙏

— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 24, 2025

”గత 2 వారాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు తమ కుటుంబాలను చూడటానికి ప్రయాణిస్తున్నారు.. చనిపోడానికి కాదు. కఠినమైన భద్రతా నిబంధనలు అమలు చేయడానికి సమయం ఆసన్నమైంది. సురక్షితమైన వైరింగ్, అత్యవసర ఎగ్జిట్స్ అవసరం. ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాలు చాలు” అని సోనూసూద్‌ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Nearly 40 lives lost in 2 weeks to bus fires.
People travel to see their families, not meet their end.
Time for strict safety norms — safer wiring, emergency exits. Enough is enough. 💔 pic.twitter.com/yXTeMPF5y3

— sonu sood (@SonuSood) October 24, 2025

ఇదిలా ఉంటే అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు లగేజీ క్యాబిన్‌లో 400 మొబైల్‌ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్‌ టీమ్ ప్రాథమికంగా గుర్తించాయి. బైక్ ని బస్సు ఢీకొట్టగానే దాని ఆయిల్‌ ట్యాంక్‌ నుంచిపెట్రోల్‌ కారడం మొదలైందని, బస్సు కింద బైక్ కొంత దూరం ఈడ్చుకెళ్లడం వల్ల మంటలు చెలరేగడం, క్యాబిన్‌లో ఉన్న మొబైల్‌ ఫోన్లు ఒక్కసారిగా పేలడం, ఆ మంటలు ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. లగేజీ క్యాబిన్‌ పైన ఉన్న బెర్తుల్లో ఉన్న ప్రయాణికులు తప్పించుకునే సమయం లేకుండా పోయిందని, అందుకే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనా స్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్‌ బృందాలు గుర్తించాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Kiran Abbavaram
  • Kurnool Bus Accident
  • Kurnool Bus Fire
  • Rashmika Mandanna
  • sonu sood

Related News

Cyclone Montha

IMD : సైక్లోన్ మోంథా కాకినాడ సమీపంలో తీరాన్ని తాకనుంది: ఐఎం‌డి హెచ్చరికలు

సైక్లోన్ మోంథా కాకినాడ సమీపంలో తీరాన్ని తాకనుంది భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ మోంథా త్వరలో కాకినాడ సమీప తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ తుఫాన్ 28 అక్టోబర్ రాత్రి లేదా 29 అక్టోబర్ ఉదయం మధ్యలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో, విశాఖపట్నం నుండి తిరుపతి వరకు విస్తారంగా భారీ వర్షాలు, 70-100 కిలోమీటర్ల

  • Kurnool Bus Fire Accident

    Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్‌కుమార్.!

  • Kaveri Travels

    Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!

  • Chandrababu

    CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!

  • Bus Accident's

    Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!

Latest News

  • Police Firing: హైదరాబాద్‌లో దొంగలపై డీసీపీ చైతన్య ఫైరింగ్ – చాదర్‌ఘాట్‌లో ఉద్రిక్తత

  • CM Chandrababu: జైత్రయాత్రలా సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన!

  • Montha Cyclone: మొంథా తుపాను.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క సూచ‌న‌లు!

  • Rohit Sharma: అజిత్ అగార్కర్‌కు సెంచ‌రీతో స‌మాధానం ఇచ్చిన రోహిత్ శ‌ర్మ‌!

  • Coconut : దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు? కారణాలు ఇవీ

Trending News

    • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా కోహ్లీ.. ఆ విష‌యంలో స‌చిన్ రికార్డు బ్రేక్‌!

    • Virat Kohli: జాతీయ జెండా అంటే కోహ్లీకి ఎంత ఇష్ట‌మో చూడండి.. వీడియో వైర‌ల్‌!

    • IND vs AUS : సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. విరాట్ క్లాస్ ఇన్నింగ్స్.. మూడో వన్డేలో ఇండియా విన్..!

    • Jio Mart : బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టా మార్ట్ లకు బిగ్ షాక్ ? రేసులోకి అంబానీ..!

    • Janhvi Kapoor : బాలీవుడ్‌లో పురుషుల అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు: జాన్వీ కపూర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd