HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Raj Kc Reddy Key Mastermind In The Ap Liquor Scam Arrested

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్‌ కెసిరెడ్డి అరెస్ట్​

  • Author : Vamsi Chowdary Korata Date : 11-06-2026 - 2:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Raj KC Reddy, key mastermind in the AP liquor scam, arrested.
Raj KC Reddy, key mastermind in the AP liquor scam, arrested.

ఈ అరెస్టుకు ముందు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ ఏకకాలంలో భారీ దాడులు నిర్వహించింది. రాజ్ కెసిరెడ్డితో పాటు మరో ఆరుగురు కీలక వ్యక్తుల నివాసాల్లో సోదాలు చేసింది. వీటిలో ఏపీఎస్‌బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవ రెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తదితరులకు చెందిన కార్యాలయాలు, నివాస ప్రాంగణాలు ఉన్నాయి.

ఈ స్కామ్‌కు సంబంధించి ఈడీ నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) లో మొత్తం 33 మందిని నిందితులుగా చేర్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ భారీ మద్యం కుంభకోణం జరిగినట్లు ఈడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి వేల కోట్ల రూపాయలను లంచాల రూపంలో అక్రమంగా వసూలు చేశారని ఈడీ స్పష్టం చేసింది.

దాదాపు రూ.3,200 కోట్ల రూపాయలను లంచాల రూపంలో వసూలు చేసి, వాటిని పట్టుబడకుండా ఉండేందుకు పలు నకిలీ, షెల్ కంపెనీల ద్వారా చేతులు మార్చారని ఈడీ గుర్తించింది. ఈ మద్యం సిండికేట్ వెనుక ఉన్న అసలు దొంగలు ఎవరు? ఈ వేల కోట్ల రూపాయల హవాలా డబ్బు చివరికి ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? అనే కోణంలో ఈడీ విచారణను మరింత వేగవంతం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh liquor scam
  • andhra pradesh politics
  • AP Liquor Scam
  • AP Liquor Scam Big Update
  • AP Liquor Scam Case
  • AP Liquor Scam Latest news
  • enforcement directorate
  • Raj Kesi Reddy

Related News

    Latest News

    • Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

    • Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

    • TRS పార్టీ మాదే..కవిత పార్టీకు మరో బిగ్ షాక్ ..ఈసీ ట్విస్ట్

    • Mahender Makhijani: అమెరికాలో బ్యాంకు మోసం ఏకంగా రూ. 950 కోట్లు.. భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్‌

    • ICC Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd