HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Raj Kc Reddy Faces Hurdles In The Supreme Court

AP liquor scam case : రాజ్‌ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

రాజ్ కెసిరెడ్డి తండ్రి ఉపేంద్రరెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. రాజ్ కెసిరెడ్డి ప్రస్తుతం కస్టడీలో ఉన్న నేపథ్యంలో బెయిల్ కోసం సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

  • Author : Latha Suma Date : 23-05-2025 - 11:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Raj KC Reddy faces hurdles in the Supreme Court
Raj KC Reddy faces hurdles in the Supreme Court

AP liquor scam case : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన రాజ్ కెసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనకు చట్టపరంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. అలాగే, రాజ్ కెసిరెడ్డి తండ్రి ఉపేంద్రరెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. రాజ్ కెసిరెడ్డి ప్రస్తుతం కస్టడీలో ఉన్న నేపథ్యంలో బెయిల్ కోసం సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు తక్షణంగా సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం లభించలేదు.

Read Also: Kavitha Letter : కవిత లేఖ పై హరీష్ రావు ఏమన్నాడంటే..!!

ఈ రెండు పిటిషన్లను జస్టిస్ పీఎస్ నరసింహా మరియు జస్టిస్ జెబి పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. వాదనలు విన్న అనంతరం ఈ నెల 19న తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం, శుక్రవారం నాడు తుది తీర్పును వెలువరించింది. ఉపేంద్రరెడ్డి తన కుమారుడు అరెస్టయ్యే సమయంలో సంబంధిత నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. ఆయన వాదన ప్రకారం, రాజ్ అరెస్టు సమయంలో ఆయన్ను ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా, అలాగే స్థానిక పోలీసులకు తెలియజేయకుండా అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.

ఇక, రాజ్ కెసిరెడ్డి తరఫు పిటిషన్‌లో, తాను తాము నివసిస్తున్న రాష్ట్రం బయట ఉన్నప్పటికీ, ఏపీ సీఐడీ అధికారులే వచ్చి అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. పక్కరాష్ట్రాల్లో అరెస్టులు చేయాలంటే స్థానిక పోలీసుల అనుమతి అవసరమని రాజ్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఈ వాదనలను సుప్రీం కోర్టు ధర్మాసనం తిరస్కరించింది. రాజ్ కెసిరెడ్డి పై ఉన్న అభియోగాలు తీవ్రతరమైనవిగా పరిగణిస్తూ, బెయిల్ మంజూరుపై ఆలోచించాలంటే తగిన కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ తీర్పుతో కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆరోపణల బారిన పడగా, రాజ్ కెసిరెడ్డి అరెస్ట్ కీలక దశగా భావిస్తున్నారు. అయితే, ఆయన తండ్రి ఉపేంద్రరెడ్డి ప్రయత్నాలు సైతం ఫలితం ఇవ్వకపోవడం ముద్దయినట్లయింది. ఈ కేసు నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి.

Read Also: Bangladesh : రాజీనామా యోచనలో బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Liquor Scam Case
  • bail petition
  • Liquor Policy
  • Raj Kesi Reddy
  • Supreme Court
  • Upendra Reddy

Related News

Supreme Court allows passive euthanasia for Harish Rana

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

Supreme Court Allows Passive Euthanasia For Harish Rana  గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్‌ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది. 13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటం

  • Speaker Clean Chit To Danam, Kadiyam Srihari

    కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd