HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Promotion For Nara Lokesh He Will Get Big Post Soon Cm Chandrababus Key Decision

Nara Lokeshs Promotion: లోకేశ్‌కు ప్రభుత్వంలోనూ ప్రమోషన్.. చంద్రబాబు ‘దూర’దృష్టి!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో చంద్రబాబు(Nara Lokeshs Promotion) బిజీగా ఉన్నారు.

  • Author : Pasha Date : 20-05-2025 - 1:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

Nara Lokeshs Promotion:  నారా లోకేశ్‌కు త్వరలోనే ప్రమోషన్ లభించబోతోంది. ఆయనను కీలక పదవి వరించబోతోంది. దీనిపై స్వయంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేయబోతున్నారు. మే 29న కడప జిల్లాలో మహానాడు బహిరంగ సభ వేదికగా ఈ ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. మే 27 నుంచి 29 వరకు టీడీపీ మహానాడు జరుగుతుంది. మహానాడు చివరి రోజున (మే 29న) నిర్వహించే బహిరంగ సభలో టీడీపీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు.

Also Read :KCR Interrogation: ‘కాళేశ్వరం’‌పై దర్యాప్తు.. కేసీఆర్ విచారణకు సన్నాహాలు

జాతీయ రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో చంద్రబాబు(Nara Lokeshs Promotion) బిజీగా ఉన్నారు. ఆయన ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై పూర్తి ఫోకస్ పెట్టారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నో పథకాల ద్వారా సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి నవ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సహకారాన్ని తీసుకుంటున్నారు.  వైఎస్సార్ సీపీ హయాంలో ఏపీలో జరిగిన కుంభకోణాలను వెలికి తీస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమిలో టీడీపీ చక్రం తిప్పుతోంది. దీంతో జాతీయ రాజకీయాలపైనా చంద్రబాబు ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ వ్యవహారాలపై లోకేశ్‌కు మరింత పట్టును పెంచాలని చంద్రబాబు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌కు ఇప్పటికే పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కేటాయించారు.  ఇప్పుడు చంద్రబాబు కూడా లోకేశ్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును అప్పగించాలని భావిస్తున్నారట. తద్వారా పార్టీలో నంబర్ 2 స్థాయికి లోకేశ్ చేరుకుంటారు. లోకేశ్‌కు పార్టీలో ప్రమోషన్‌ గురించి అధికారిక ప్రకటన చేయడానికి కడప మహానాడు కార్యక్రమమే సరైన వేదిక అని చంద్రబాబు అనుకుంటున్నారట.

Also Read :Akash Anand : బీఎస్పీలోకి ఆకాశ్ ఆనంద్‌ ‘పవర్ ఫుల్’ రీఎంట్రీ.. ఎలా సాధ్యమైంది ?

ప్రభుత్వంలోనూ లోకేశ్‌కు ప్రమోషన్.. ? 

నారా లోకేశ్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు డిప్యూటీ సీఎం పోస్టును కూడా ఇవ్వాలని టీడీపీ వర్గాలు చంద్రబాబును కోరుతున్నాయి. తద్వారా పాలనా వ్యవహారాలపైనా లోకేశ్‌కు పట్టు పెరుగుతుందని చెబుతున్నారు.  అయితే దీనిపై ఎక్కువగా డిస్కస్ చేయొద్దని పార్టీ క్యాడర్‌కు టీడీపీ పెద్దల నుంచి సూచనలు అందినట్లు తెలుస్తోంది. చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేశే. లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వమని అడిగే స్వేచ్చను కూడా తమకు ఇవ్వకపోతే ఎలా అని కొందరు టీడీపీ నేతలు వాపోతున్నారు. చంద్రబాబు రాజకీయ చాణక్యుడని,  సరైన సమయం చూసి ఆయన తప్పకుండా లోకేశ్‌కు ప్రభుత్వంలోనూ ప్రమోషన్ ఇస్తారని మరికొందరు టీడీపీ నేతలు అంటున్నారు. ఏపీలోని కూటమి సర్కారులో భాగంగా ఉన్న అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాక.. వచ్చే ఎన్నికల నాటికి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పోస్టును చంద్రబాబు కేటాయిస్తారని చెబుతున్నారు. ఇప్పుడే ఆ పదవిని లోకేశ్‌కు కేటాయిస్తే.. కూటమిలోని పార్టీలతో టీడీపీకి గ్యాప్ పెరిగే ముప్పు ఉందట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • chandrababu
  • CM Chandrababu
  • nara lokesh
  • Nara Lokeshs Promotion
  • tdp

Related News

Massive public meeting on the alliance's two-year rule

Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చి వెళ్లిన సవాళ్లు, సంక్షోభాలను అధిగమించి, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నా

  • Zomato gets Rs 9.6 crore GST demand from Andhra Pradesh

    Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

  • That is the very day the 'Thalliki Vandanam' money gets credited!

    Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

  • Centre sanctions massive funds for AP: Union Minister Pemmasani Chandra Sekhar

    Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • Central government showering blessings on Amaravati

    Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

Latest News

  • Venkateswara Suprabhatam: వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?

  • Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

  • Prakash Raj: ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు

  • Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

  • Nara Lokesh: రాయలసీమలో రత్నాలు పడేలా చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు: మంత్రి నారా లోకేష్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd