HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Prime Minister Modi To Visit Kurnool On The 16th Of This Month

PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ అక్టోబర్ 16వ తేదీ ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు.

  • Author : Gopichand Date : 13-10-2025 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi
PM Modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని దర్శించుకోవడంతో పాటు నన్నూరులో కీలకమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ ఖరారైంది.

పర్యటన వివరాలు- శ్రీశైలంలో పూజలు

షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ అక్టోబర్ 16వ తేదీ ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు.

  • ఉదయం 10:20 గంటలకు ఆయన కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి, ఉదయం 11:10 గంటలకు శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారు.
  • ఉదయం 11:45 గంటలకు ప్రధాని మోదీ, ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.

నన్నూరులో అభివృద్ధి కార్యక్రమాలు

  • శ్రీశైలం పర్యటన అనంతరం ప్రధాని కర్నూలులోని నన్నూరు ప్రాంతానికి చేరుకుంటారు.
  • మధ్యాహ్నం 1:40 గంటలకు సుండిపెంట హెలిప్యాడ్‌ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రయాణిస్తారు.
  • మధ్యాహ్నం 2:30 గంటలకు రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌ వద్ద జరగనున్న కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
  • అనంతరం అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభ సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగనుంది.

Also Read: Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

తిరుగు ప్రయాణం

  • బహిరంగ సభ ముగిసిన తర్వాత ప్రధాని తిరిగి ఢిల్లీకి పయనం అవుతారు.
  • సాయంత్రం 4:15 గంటలకు రోడ్డు మార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
  • సాయంత్రం 4:40 గంటలకు కర్నూలు విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని రాకతో ఈ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం ద్వారా అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని స్థానిక నాయకులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • kurnool
  • pm modi
  • telugu news

Related News

Minister Vasamsetti Subhash

భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఏర్పాటు చేసిన ఫీడ్‌బ్యాక్ బుక్స్‌లో 99 శాతం మంది భక్తులు సానుకూల స్పందన ఇచ్చారని మంత్రి తెలిపారు.

  • Cashless Care

    రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్‌ వైద్యం!

  • Special Trains For Sankranti 2026

    సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు

  • Songa Roshan Kumar

    గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్

  • Ap Sports Infrastructure And Construct Indoor Hall

    ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ జిల్లాలకు రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు..

Latest News

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

  • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

  • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

Trending News

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd