Nadendla : ఏపీలో మరోసారి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గింపు: మంత్రి నాదెండ్ల
ఏపీలోని సామాన్య ప్రజలకు మరోమారు ధరలను తగ్గించి నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించిన ఏపి ప్రభుత్వం.
- By Latha Suma Published Date - 04:17 PM, Wed - 31 July 24

Reduction In prices Of Essential goods: ఏపిలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం మరోసారి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) మీడియాకు వెల్లడించారు. ఈ నెల రోజుల్లో నిత్యావసర సరకుల ధరలు రెండుసార్లు తగ్గించాం. నిత్యావసర సరకుల ధరలు మరోసారి తగ్గించాలని నిర్ణయించాం. బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ రైస్ ధరలు మరో దఫా తగ్గిస్తాం. బహిరంగ మార్కెట్లో కంది పప్పు ధర రూ.160 నుంచి 150 కి తగ్గింపు. బియ్యం రూ.48 నుంచి 47, స్టీమ్డ్ రైస్ రూ.49 నుంచి రూ.48కి తగ్గింపు. తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి రేపటి నుంచి విక్రయిస్తారని ఆయన పేర్కొన్నారు. దీనికి కావలసిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశించానని ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ లో షేర్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పరిపాలన పరంగా పేదలకు ఏ అవసరం ఉంటుందో అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు అన్న క్యాంటిన్ల పున:ప్రారంభం వంటి కీలక బిల్లులపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. నెల రోజుల కిందటే కూటమి ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించింది. తాజాగా మరోసారి తగ్గించాలని భావిస్తుంది. ప్రస్తుతం తగ్గించిన ధరలతో ఈ నిత్యావసరాలు రేపటి నుంచి అన్ని రైతు బజార్లలోను ప్రత్యేక కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి.