HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Police Have Arrested The Accused In The Murder Of Nellore Couple

Nellore : దంపతుల హత్యకేసులో వీడిన మిస్టరీ…సప్లయిరే హంతకుడని తేల్చిన పోలీసులు..!!

నెల్లూరులో శనివారం రాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. శివ, రామకృష్ణ అనే ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

  • Author : hashtagu Date : 31-08-2022 - 7:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nellore Murder
Nellore Murder

నెల్లూరులో శనివారం రాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. శివ, రామకృష్ణ అనే ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. శివ, రామకృష్ణ ఇద్దరూ బావ బామ్మర్దులు. ఇద్దరూ కలిసి కృష్ణారావు, సునీతలను హత్య చేశారు. కృష్ణారావు హోటల్ లో శివ సప్లయిర్ గా పనిచేస్తున్నాడు. ఒక రోజు అందరిముందు శివను కృష్ణారావు మందలించాడు. దాంతో యజమానిపై శివ కక్ష పెంచుకున్నాడు. దాంతో శివ తన బావ రామకృష్ణతో కలిసి కృష్ణారావు దంపతులను హత్య చేసినట్లు సమాచారం.

నెల్లూరులోని విద్యుత్ శాఖా కార్యాలయం వద్ద శ్రీరామ క్యాంటీన్ అధినేత వాసిరెడ్డి కృష్ణారావు పడారుపల్లి సమీపంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. వారి ఇద్దరు కుమారులు ప్రేమ్ చంద్, సాయిచంద్ లకు పెళ్లిళ్లు కావడంతో వారు వేరుగా ఉంటున్నారు.కృష్ణారావుకు హోటల్ ఉండటంతో అర్ధరాత్రి వరకు అక్కడే ఉండేవాడు. రాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్లేవాడు. శనివారం రాత్రి సునీత తన భర్త ఇంటికి వస్తారని తలుపులకు గడి వేయకుండా తన గదిలోకి వెళ్లి నిద్రపోయారు.

అప్పటికే ముందస్తు ప్లాన్ ప్రకారం శివ, రామకృష్ణ ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్ రూమ్ లో నిద్రపోతున్న సునీత తలపై కర్రతో గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది.
అదే సమయంలో ఇంటికి వచ్చిన కృష్ణారావుపై దాడి చేసి అతని గొంతుకోసి హత్యచేశారు. డీఎస్పీ అబ్దుల్ సుబహాన్ పర్యవేక్షణలో వేదాయపాలెం సీఐ నరసింహారావు, ప్రత్యేక పోలీస్ బ‌ృందం నిందితులు శివ, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • couple murder
  • crime news
  • Nellore
  • nellore police

Related News

UP Woman Runs Away After Sending Husband To Buy Pakoda At Bus Stand

భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

UP Woman Runs Away After Sending Husband To Buy Pakoda At Bus Stand   ఆకలేస్తోందని భార్య అడిగింది. పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి భర్త పకోడీలు తీసుకొచ్చాడు. కానీ, తిరిగి వచ్చి చూసేసరికి ఆమె కనిపించలేదు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ వింత ఘటన పోలీసుల వరకు వెళ్లింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అస‌లేం జ‌రిగిందంటే..! యూపీలోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్‌కు, రాంపూర్ జిల్లాక

  • Nellore Gets India’s First Autonomous Maritime Shipyard

    Nara Lokesh: నెల్లూరులో అటానమస్ మారిటైం షిప్ యార్డు.. ప్రపంచంలోనే మొదటిది.!

Latest News

  • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

  • ఆదివారం రోజే సెల‌వు ఎందుకు ఇస్తున్నారో తెలుసా?

  • 10 ఏళ్ల త‌ర్వాత తండ్రి కాబోతున్న సూర్యకుమార్ యాదవ్.. వీడియో వైర‌ల్‌!

  • కారు ఈఎంఐ పద్ధతిలో తీసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఈ విష‌యాలు గుర్తుంచుకోండి!

  • మిడిల్ ఈస్ట్ సంక్షోభం.. ఎల్‌పీజీపైనే ఎందుకు ఎఫెక్ట్ ప‌డింది?

Trending News

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd