HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pm Modis Mission South Pawan Kalyans Visit To South States From 12th February

Mission South : ప్రధాని మోడీ ‘మిషన్ సౌత్’.. పవన్ ఏం చేయబోతున్నారు ?

నాలుగు రోజుల ఈ పర్యటనలో భాగంగా అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామ స్వామి, అగస్త్య  జీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్(Mission South) దర్శించుకుంటారు.

  • Author : Pasha Date : 10-02-2025 - 5:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pm Modi Mission South Pawan Kalyan South States Tour Tamilnadu Kerala Jana Sena Bjp Ap

Mission South : జనసేన పార్టీ కేవలం జనసేనాని, ఆంధ్రప్రదేశ్  డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కే కాదు.. బీజేపీకి కూడా చాలా ముఖ్యమైంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమతో ఉండే నమ్మకమైన భాగస్వామిగా జనసేన పార్టీని బీజేపీ పరిగణిస్తోంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు పవన్ కల్యాణ్‌కు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ దక్షిణాది రాష్ట్రాల్లో కమల వికాసం కోసం పవన్ చరిష్మా తమకు ఉపయోగపడుతుందనే విశ్వాసంతో వారు ఉన్నారు. ప్రధాని మోడీ ‘సౌత్ మిషన్’‌లో జనసేనాని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈక్రమంలోనే ఈనెల 12 నుంచి  పవన్ కల్యాన్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు. నాలుగు రోజుల ఈ పర్యటనలో భాగంగా అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామ స్వామి, అగస్త్య  జీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్(Mission South) దర్శించుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఇటీవలే పవన్ చేసిన వ్యాఖ్యలకు పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటించారు.

Also Read :Ranveer Allahbadia: ‘‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా ?’’.. యూట్యూబర్ నీచ వ్యాఖ్యలపై దుమారం

ఏమిటీ ‘మిషన్ సౌత్’ ?

  • దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడమే ప్రధాని మోడీ ‘సౌత్ మిషన్’ లక్ష్యం.
  • దక్షిణాది రాష్ట్రాల్లో హిందుత్వ భావజాలాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ప్రచారం చేయడం అనేది ముఖ్యమైన ఎజెండా.
  • ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పర్యటనల ద్వారా.. ఏపీలోనూ ఆయన రాజకీయ చరిష్మాను మరింత పెంచాలనేది బీజేపీ వ్యూహం. పవన్ చరిష్మా పెరిగితే రానున్న కాలంలో ఏపీలో రాజకీయ ప్రయోజనం పొందొచ్చని కమలదళం భావిస్తోంది.
  • దక్షిణాది రాష్ట్రాల్లో మరింత మంది సినీ స్టార్లను బీజేపీ వైపు ఆకర్షించాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఆ ఆసక్తి ఉన్నవారికి స్ఫూర్తి కలిగించేలా పవన్‌ను ప్రయోగిస్తున్నారు.
  • దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో 40 నుంచి 50 లోక్‌సభ స్థానాలను గెలవాలనే బీజేపీ కల నేటికీ నెరవేరలేదు. అది నెరవేరాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి పవన్ కల్యాణ్ లాంటి జనాకర్షక నాయకులు కావాలి.
  • ఏపీ తరహాలో ఇతరత్రా దక్షిణాది రాష్ట్రాల్లోనూ భావసారూప్య పార్టీలతో కూటమి కట్టాలనే ప్రణాళికలు బీజేపీకి ఉన్నాయి. ఆ సందేశాన్ని పరోక్షంగా ఇతర దక్షిణాది రాష్ట్రాలకు చేరవేసేందుకు పవన్ కల్యాణ్‌ను బీజేపీ వినియోగించుకుంటోంది.

Also Read :RK Roja : రోజా సీటుకు ఎస‌రు.. 12న వైఎస్సార్ సీపీలోకి గాలి జ‌గ‌దీష్ ప్ర‌కాశ్ ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • bjp
  • Jana Sena
  • kerala
  • Mission South
  • Pawan Kalyan
  • pm modi
  • South States Tour
  • tamilnadu

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • Big shock for YouTuber Ravan

    YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

  • Teejan Bai Passes Away

    Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత‌

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd