HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Viral
  • >Ranveer Allahbadia Faces Severe Backlash For His Joke On Indias Got Latent Says Watch Your Parents Have S X Or

Ranveer Allahbadia: ‘‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా ?’’.. యూట్యూబర్ నీచ వ్యాఖ్యలపై దుమారం

రణ​వీర్​ అలహాబాదియా(Ranveer Allahbadia) సహా ‘ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షో’లో పాల్గొన్న ఇతర కామిక్స్​పై ఎఫ్​ఐఆర్​ వేయాలని సదరు లాయర్లు డిమాండ్​ చేశారు.

  • By Pasha Published Date - 02:07 PM, Mon - 10 February 25
  • daily-hunt
Ranveer Allahbadia Indias Got Latent Youtuber Podcaster

Ranveer Allahbadia: ‘‘మీ తల్లిదండ్రులు శృంగారం చేస్తున్న సమయంలో.. చూస్తావా?’’ అంటూ సోనీ లివ్‌లో ప్రసారమయ్యే ‘ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షో’లో ప్రముఖ యూట్యూబర్​ రణ​వీర్​ అలహాబాదియా నీచమైన వ్యాఖ్యలు చేశాడు. అతడి వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం పెల్లుబుకుతోంది. యావత్ నెటిజన్లు రణవీర్ కామెంట్స్‌ను తప్పుపడుతున్నారు. తల్లిదండ్రుల లైంగిక సంబంధంపై అతడు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రణవీర్ అలహాబాదియా ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేసినందుకు, అతడిపై, ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షోపై పోలీసులకు కంప్లయింట్ అందింది.

Also Read :RK Roja : రోజా సీటుకు ఎస‌రు.. 12న వైఎస్సార్ సీపీలోకి గాలి జ‌గ‌దీష్ ప్ర‌కాశ్ ?

ఇద్దరు లాయర్లు..

ముంబైకు చెందిన లాయర్లు ఆశిష్​ రాయ్​, పంకజ్​ మిశ్రాలు ముంబై పోలీస్ కమిషనర్​, మహారాష్ట్ర మహిళా కమిషన్​‌లకు ఈ ఫిర్యాదులు ఇచ్చారు. రణ​వీర్​ అలహాబాదియా(Ranveer Allahbadia) సహా ‘ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షో’లో పాల్గొన్న ఇతర కామిక్స్​పై ఎఫ్​ఐఆర్​ వేయాలని సదరు లాయర్లు డిమాండ్​ చేశారు. వారి వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు.

మహారాష్ట్ర సీఎం సీరియస్

ఈ అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా సీరియస్ అయ్యారు. ‘‘ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్య్రం ఉంటుంది. అయితే ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రయత్నం చేసినప్పుడు, మన స్వేచ్ఛ ముగిసిపోతుంది’’ అని సీఎం కామెంట్ చేశారు. ‘‘భారతీయ సమాజానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే అది తప్పు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Also Read :Gold From Electronics : ఎలక్ట్రానిక్‌ స్క్రాప్ నుంచీ గోల్డ్.. శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ

‘ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షో’లో అసలు ఏం జరిగింది ?

  • రణవీర్​ అలహాబాదియా ​ బీర్ ​బైసెప్స్ పేరుతో యూట్యూబ్​ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.
  • ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షోను సమయ్​ రైనా నిర్వహిస్తున్నారు. ఇది సీజన్ 8 వరకు కలర్స్ టీవీలో ప్రసారమైంది. సీజన్ 9 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం చేస్తున్నారు.
  • ఈ షోలో కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజాతో పాటు రణవీర్ ​ అలహాబాదియా పాల్గొన్నారు.
  •  ఈ షోలో ఒక కంటెస్టెంట్​కి రణవీర్ అలహాబాదియా వేసిన ప్రశ్న వివాదానికి దారితీసింది.
  • ‘‘మీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని జీవితం మొత్తం చూస్తావా? లేక ఒకసారి జాయిన్​ అయ్యి, జీవితం మొత్తం చూడకుండా ఉంటావా?” అని రణ​వీర్ అలహాబాదియా​ అడిగారు. ఆ షోలో పాల్గొన్న వారంతా ఈ మాటలు విని షాక్​ అయ్యారు. సమయ్​ రైనా కూడా షాక్ అయ్యారు. ‘‘రణ్​వీర్‌కు ఏమైంది?’’ అని ఆయన ప్రశ్నించారు.
  • షోలో పాల్గొన్నవారంతా రణవీర్ మాటలను ఫన్నీగా తీసుకున్నారు. అయితే ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beerbiceps Controversy
  • Indias Got Latent
  • Podcaster
  • Ranveer Allahbadia
  • Youtuber

Related News

    Latest News

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd