PM Modi : మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన
ప్రధాని మోడీ ఏప్రిల్ 3వ వారంలో లేదా నాలుగో వారంలో అమరావతి పర్యటనకు వస్తారని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో మే 2వ తేదీన ప్రధాని మోడీ వస్తారని పీఎంవో కన్ ఫర్మేషన్ ఇచ్చింది. ఇదే విషయాన్ని క్యాబినెట్ సహచరులకు సీఎం చంద్రబాబు చెప్పారు.
- Author : Latha Suma
Date : 15-04-2025 - 6:05 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi : మే 2న ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోడీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3 ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయాలని సీఎం వెల్లడించారు.
Read Also: IND vs BAN: బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
కాగా, ప్రధాని మోడీ ఏప్రిల్ 3వ వారంలో లేదా నాలుగో వారంలో అమరావతి పర్యటనకు వస్తారని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో మే 2వ తేదీన ప్రధాని మోడీ వస్తారని పీఎంవో కన్ ఫర్మేషన్ ఇచ్చింది. ఇదే విషయాన్ని క్యాబినెట్ సహచరులకు సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి పునర్ నిర్మాణ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీని పిలిచి ఆ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.
మనం తీసుకునే రాజకీయ నిర్ణయాల్లో ఎలాంటి గందరగోళం ఉండకూడదు. ప్రజలకు ఏది మంచో అదే నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం. వైసీపీ వక్ఫ్ బోర్డ్ బిల్లు అంశంలో 3 రకాలుగా వ్యవహరించింది. పార్లమెంట్ లో ఒకలా, రాజ్యసభ లో మరోలా, కోర్టులో మరోలా వైసీపీ వ్యవహరించింది. వైసీపీ రాజకీయ కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే, మనం తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకోవాలి అని సీఎం మంత్రులకు సూచించారు.
ఇక, గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా ప్రధానిని అమరావతి పునర్ నిర్మాణ పనులకు హాజరుకావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే, ప్రధాని సమయం, షెడ్యూల్ అన్నీ చూసుకున్నాక ప్రధాని కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు తన క్యాబినెట్ సహచరులకు ఈ విషయాన్ని తెలియజేశారు. మే 2వ తేదీన సాయంత్రం ప్రధాని మోడీ వచ్చే అవకాశం ఉందన్నారు.