MODI VIZAG TOUR : నవంబర్ 11న విశాఖకు రానున్న ప్రధానమంత్రి మోదీ..!!
వచ్చే నెల నవంబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...ఏపీలో పర్యటించనున్నారు. ఒకరోజు విశాఖలో పర్యటిస్తారు మోదీ.
- Author : hashtagu
Date : 26-10-2022 - 9:37 IST
Published By : Hashtagu Telugu Desk
వచ్చే నెల నవంబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…ఏపీలో పర్యటించనున్నారు. ఒకరోజు విశాఖలో పర్యటిస్తారు మోదీ. రూ. 400కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటుగా పలు అభివ్రుద్ది, సంక్షేమ కార్యక్రమాల్లోనూ ప్రధాని మోదీ పాల్గొనున్నారు. తర్వాత ఆంధ్రయూనివర్సిటీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు.
చానాళ్ల తర్వాత మోదీ ఏపీ పర్యటకు విచ్చేస్తున్నారు. ఏపీలో మూడు రాజధానులకు అనుకూలంగా విశాఖలో జేఏసీ, వైసీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాగుతున్న సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టారు. ఈ తరుణంలో విశాఖల మోదీ కార్యక్రమం జరుగనుండటంతో మూడు రాజధానులకు అనుకూల, వ్యతిరేక శిభిరాలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారోనన్న ఆసక్తి నెలకొంది.