Banakacherla Project : దయచేసి తెలంగాణ అర్థం చేసుకోవాలి – నిమ్మల రామానాయుడు
Banakacherla Project : రాయలసీమకు నీరు అందించేందుకు హంద్రీనీవా, బుడమేరులో పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే పంటకాలానికి తగిన సూచనలతో పాటు మద్దతు ధరలు ప్రకటించనున్నట్లు
- By Sudheer Published Date - 08:52 AM, Sat - 7 June 25

ఏపీలో పోలవరం-బనకచర్ల (Polavaram – Banakacherla project) అనుసంధానం ప్రాజెక్టు త్వరలోనే ముందుకు కదలనుంది. సముద్రంలో వృథాగా కలిసిపోతున్న గోదావరి నీటిని రాయలసీమ ప్రాంతానికి ఉపయోగించేందుకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకోసం ఈ నెలలోనే టెండర్లు ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు.
Hair Loss : మహిళల జుట్టు రాలిపోవడానికి కారణం..వారు చేసే ఈ పనులే !!
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులపై ప్రత్యేక దృష్టి సారించామని, భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ నుంచి వస్తున్న అభ్యంతరాలను తప్పుబడుతూ, నదుల అనుసంధానం ప్రతి రాష్ట్రానికీ మేలు చేస్తుందన్నది కేఎల్ రావు సిద్ధాంతమని గుర్తుచేశారు. గోదావరి నీటిని వృథా కాకుండా వినియోగించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని, రాజకీయ ప్రయోజనాల కోసమే దీనిపై విమర్శలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.
New Scheme : ఏపీలో మరో కొత్త పథకం..ఎవరికోసం అంటే !!
రాష్ట్రంలో నీటి నిర్వహణను శాస్త్రీయంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారని, వాటర్ ఆడిటింగ్, మేనేజ్‌మెంట్ చేపట్టిన కారణంగా ఈ ఏడాది అదనంగా 200 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని మంత్రి వెల్లడించారు. రాయలసీమకు నీరు అందించేందుకు హంద్రీనీవా, బుడమేరులో పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే పంటకాలానికి తగిన సూచనలతో పాటు మద్దతు ధరలు ప్రకటించనున్నట్లు తెలిపారు. భూగర్భజలాలను పెంపొందించేందుకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.