Pinnelli Ramakrishna Reddy: మూడు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఊరట కల్పించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది.
- By Praveen Aluthuru Published Date - 02:18 PM, Tue - 28 May 24

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఊరట కల్పించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి హైకోర్టు ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇది జరిగింది. తనపై ఉన్న కేసుల తుది ఫలితం కోసం ఎదురుచూస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి కోర్టు నిర్ణయం తాత్కాలిక రక్షణ కల్పించింది. అయితే కొన్ని షరతులను కూడా విధించింది హైకోర్టు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లకు వెళ్లకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మరో ప్రదేశమైన నరసాపురం పూర్తి చిరునామాను సంబంధిత అధికారులకు, అలాగే దేశం దాటకూడని, అతని పాస్‌పోర్టును కూడా అప్పగించాలని ఆదేశించింది. దాంతో పాటు ప్రతిరోజూ ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించింది.
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని పిన్నెల్లి అరెస్టుకు ఆదేశించింది.
Also Read: Summer Tips : వేసవిలో కూడా చెమట తక్కువగా పడితే.. నిర్లక్ష్యం చేయకండి..!