HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Meets Chandrababu Naidu Discussion On Allocations To Various Departments

Ap Assembly : చంద్రబాబుతో పవన్ భేటీ.. వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ

దాదాపు గంటపాటు వీరి భేటీ కొనసాగింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్‌ చేస్తూ కేటాయింపులు ఉన్నట్లు పవన్‌ అభిప్రాయపడ్డారు. మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.

  • Author : Latha Suma Date : 03-03-2025 - 8:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan meets Chandrababu Naidu.. Discussion on allocations to various departments
Pawan meets Chandrababu Naidu.. Discussion on allocations to various departments

Ap Assembly : ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ భేటి అయ్యారు. ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు ఛాంబర్‌కు పవన్‌ కల్యాణ్‌ వెళ్లారు. ఆయన ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చించారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అంశంపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. దాదాపు గంటపాటు వీరి భేటీ కొనసాగింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్‌ చేస్తూ కేటాయింపులు ఉన్నట్లు పవన్‌ అభిప్రాయపడ్డారు. మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.

Read Also: Ayodhya’s Ram Mandir : అయోధ్య ఆలయంపై దాడికి పాకిస్థాన్ కుట్ర

ఇక, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థి వెనుకంజలో ఉండటం, పీడీఎఫ్ అభ్యర్థి ముందంజలో ఉండటంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ భేటీ కొనసాగుతోంది. ముగిసిన తర్వాత ఈ భేటీ ఎందుకనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఇద్దరి భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది ఐదు ఎమ్మెల్సీ స్థానాలల్లో జనసేన‌ రెండు, బీజేపీ ఒక ఎమ్మెల్సీని కోరుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇప్పటికే ఎమ్మెల్సీ ఖరారు అయింది. ఇంకో ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరుతున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న విషయం తెలిసిందే. మార్చి 29తో ఐదుగురు సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్‍బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ కాలం ముగియనుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా సోమవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది.

Read Also: BJLP : ఇక మారేది తెలంగాణ ముఖ్యమంత్రే : మహేశ్వర్ రెడ్డి కీలకవ్యాఖ్యలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap assembly
  • AP Assembly Sessions
  • CM Chandrababu
  • Deputy CM Pawan Kalyan
  • MLA quota
  • MLC Election

Related News

Pawan Cbn Hyd

Hyderabad : సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం – పవన్

రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను, మహిళలను బూట్లతో తన్నించడం, దౌర్జన్యాలు చేయడం అమానుషమని మండిపడ్డారు. నాడు కనీసం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకే రక్షణ లేని పరిస్థితుల్లో, సామాన్య రైతులకు రక్షణ

  • Pawan Speech Assembly

    AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Amaravati Capital

    AP Assembly: అమరావతికి చట్టబద్ధత

  • Speaker Ayyanna Patrudu

    AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం : అయ్యన్నపాత్రుడు

Latest News

  • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

  • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

  • MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

  • Crime News: స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

  • Spam Calls : స్పామ్ కాల్సు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి..మళ్లీ అలాంటి కాల్స్ ఉండవు !!

Trending News

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd