Pawan Kalyan : చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఆలయ యాత్ర వాయిదా
Pawan Kalyan :ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనివార్య కారణాలతో ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేశారు.
- By Kavya Krishna Published Date - 06:11 PM, Wed - 5 February 25

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నిర్ధేశించిన ఆలయ యాత్రను చివరి నిమిషంలో వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైందవ ధర్మ పరిరక్షణను ప్రధానంగా ఉద్దేశిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్న ఆయన, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలనే సంకల్పంతో ఐదు రోజుల పర్యటనను ప్రకటించారు. ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనివార్య కారణాలతో ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేశారు.
పవన్ కళ్యాణ్ హైందవ ధర్మ పరిరక్షణకు తన వంతు కృషి చేయాలనే సంకల్పంతో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా, దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి, అక్కడి ధార్మికత, భక్తి భావాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అనుకున్నారు. ఈ యాత్రలో భాగంగా అనంతపద్మనాభ స్వామి ఆలయం, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం, మధురై మీనాక్షి దేవస్థానం, రమేశ్వర శివక్షేత్రం తదితర ప్రాచీన ఆలయాలను సందర్శించాలనుకున్నారు.
BCCI Drops ‘Ro-Ko’: నెట్స్‌లో చెమటోడుస్తున్న స్టార్ ప్లేయర్స్.. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ!
అయితే, అనుకోని కారణాలతో ఈ యాత్రను చివరి నిమిషంలో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలిసిన వెంటనే, జనసేన పార్టీ శ్రేణులు, హైందవ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై చర్చ మొదలుపెట్టారు.
పవన్ కళ్యాణ్ పర్యటనను వాయిదా వేయడానికి గల అసలు కారణం ఏమిటనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ ఆలయ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారా? లేక మరొక తేదీకి మళ్లీ ప్రకటిస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పర్యటన ద్వారా పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రజలకు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ యాత్రకు సంబంధించిన నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రకటించే అవకాశముంది.
ఈ ఆలయ యాత్ర పట్ల హైందవ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రత్యేకించి, పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితం, పాలనా విధానంలో హైందవ ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, ఈ యాత్రకు రాజకీయ ప్రాధాన్యత కూడా పెరిగింది.
ఇక, పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయం పార్టీ వర్గాల్లోనూ, పొలిటికల్ సర్కిల్స్‌లోనూ ఆసక్తికర చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ ఆలయ యాత్ర వాయిదా వెనుక వాస్తవ కారణం ఏమిటో త్వరలోనే స్పష్టత రానుంది. జనసేన శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు, హైందవ వర్గాలు పవన్ కళ్యాణ్ తదుపరి నిర్ణయం ఏమిటనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Umpire Nitin Menon: పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించిన భారత అంపైర్.. రీజన్ ఇదే!