Modi and Pawan: మోదీతో పవన్ కల్యాణ్ ప్రత్యేక భేటీ..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విశాఖలో పర్యటించనున్నారు.
- By Gopichand Published Date - 09:56 PM, Thu - 10 November 22

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దీంతో వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. రాష్ట్రంలో పరిస్థితులు, తాజా రాజకీయాలపై వీరిద్దరు చర్చించే అవకాశముందని సమాచారం. విశాఖలో భాజపా నిర్వహించే ర్యాలీలో పవన్ పాల్గొంటారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.