Chandrababu Remand: చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి జైలుకు జనసేనాని
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు మొదటిసారి జైలుకెళ్లడం టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు.
- By Praveen Aluthuru Published Date - 03:38 PM, Wed - 13 September 23

Chandrababu Remand: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు మొదటిసారి జైలుకెళ్లడం టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. తమ అధినాయకుడిని అన్యాయంగా కేసులో ఇరికించారంటూ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు.
తండ్రి రిమాండ్ తో నారా లోకేష్ ఉగ్రరూపం దాల్చాడు. సైకో జగన్ అంటూ ఏకిపారేశాడు. చంద్రబాబు కస్టడీతో జనసేన అధినేత ప్రభావం చూపిస్తున్నాడు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాడు. లోకేష్ ఒంటరి కాదు నేనున్నానని భరోసా ఇచ్చాడు. ఇదిలా ఉండగా నిన్న మంగళవారం ఏసీబీ కోర్టులో హౌస్ కస్టడీని కోరుతూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే రిమాండ్ లో ఉన్న వ్యక్తిని హౌస్ అరెస్ట్ కు ఛాన్స్ లేదంటూ తోసిపుచ్చింది కోర్టు. దీంతో నాయుడు 14 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండాల్సి ఉంది.
రేపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకు వెళ్లనున్నాడు. గురువారం ఉదయం అయన చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రికి వెళతారు. రాజమండ్రి జైలు పరిసర ప్రాంతంలో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. మరి రేపు పవన్ రాక నేపథ్యంలో మరింత భద్రతను ఏర్పాటు చేయనున్నారు. కాగా నిన్న మంగళవారం నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి చంద్రబాబుని కలిసిన విషయం తెలిసిందే.
Also Read: Nipah Virus Deaths: కేరళలో కోరలు చాస్తున్న నిఫా.. మూడు జిల్లాలు కంటైన్మెంట్ జోన్స్