Tirumala : వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
నేను ఎప్పుడూ ప్రజాహితం కోసం పనిచేస్తా. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించా. గతంలో ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నాం. ఏడుకొండలను ఆనుకొని ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదు. వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటమే మా లక్ష్యం అన్నారు.
- By Latha Suma Published Date - 12:05 PM, Fri - 21 March 25

Tirumala: మనవడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంగ అన్నదాన కేంద్రంలో భక్తులకు అన్నదానం నిర్వహించాక చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని.. అన్నదానానికి చాలా మంది వితరణ ఇస్తున్నారని అన్నారు. ఏడు కొండలు.. వేంకటేశ్వరస్వామి సొంతం. ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు. నేను ఎప్పుడూ ప్రజాహితం కోసం పనిచేస్తా. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించా. గతంలో ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నాం. ఏడుకొండలను ఆనుకొని ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదు. వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటమే మా లక్ష్యం అన్నారు.
Read Also: IPL 2025: ఐపీఎల్ 2025 కోసం అంపైర్లను ప్రకటించిన బీసీసీఐ!
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాలను కట్టాలని నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. తిరుమల ఆలయంలో కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలన్నారు. అన్య మతస్తులను తిరుమలలో కాకుండా ఇతర చోట్ల వారిని షిఫ్ట్ చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా ఇతర మత ప్రార్థనా స్థలాల్లో హిందువులు లేకుండా చూస్తామన్నారు. ప్రతి ఏడాది, ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వచ్చి అన్నదానం సత్రానికి తమ వంతు విరాళం అందిస్తున్నారు. ఇది శాశ్వతంగా జరిగే ప్రక్రియ. భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిది. మా కుటుంబసభ్యులం మొత్తం కలిసి ఈరోజు భక్తులకు వడ్డించాం. భావి తరాలు ఇలాంటి మంచి పనులు వీలున్నప్పుడు నిర్వహించాలి. ఎన్టీఆర్ హయాంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. నేడు 2200 కోట్ల కార్పస్ ఉంది.
తిరుమలలో తెలిసో తెలియక అపచారం జరిగితే తప్పులు దిద్దుకోవాలి. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో స్వామి వారి ఆలయంలో అపచారం జరిగింది.నేను ప్రాణదాన కార్యక్రమం ప్రారంభించా. బ్రహ్మోత్సవానికి వచ్చిన సమయంలో తిరుపతి స్విమ్స్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచం నుంచి ఎవరైనా భక్తులు ఇక్కడికి వస్తే వారు కూడా మానవ సేవ చేస్తున్నారు. ఈ ఏడు కొండలలో అపవిత్ర కార్యక్రమాలు గానీ, తిరుమలలో కమర్షియల్ బిల్డింగ్స్ కట్టడం కానీ జరగకూడదు. అసెంబ్లీలో 5 కొండలు అన్నారు. ఆ సమయంలో పాదయాత్రతో వచ్చి మొక్కులు తీర్చుకున్నాను. ప్రభావితం చేయగలిగే వ్యక్తులు మౌనంగా సమాజానికి నష్టం జరుగుతుంది. 24 క్లైమోర్ మైన్స్ నా మీద ప్రయోగించారు. నేను తప్పించుకుకోవడం అసాధ్యం. కానీ సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామి నన్ను కాపాడారు. అందరం బతికినా గాయాలయ్యాయి. 24 క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశాక మేం బతికామంటే శ్రీవారి మహిమకు అది నిదర్శనం అని సీఎం చంద్రబాబు అన్నారు.
Read Also: Betting Apps case : హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల