HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Officials Have Commenced Demolition Work On The 130 Year Old Railway Bridge

130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత పనులు మొదలు పెట్టిన అధికారులు.

  • Author : Vamsi Chowdary Korata Date : 23-03-2026 - 2:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayawada Krishna Palace Bridge Demolition
Vijayawada Krishna Palace Bridge Demolition

Vijayawada Krishna Palace Bridge Demolition  కృష్ణా నదిపై స్వాతంత్ర్యం రాక ముందు నిర్మించిన బ్రిడ్జి చరిత్రలో ఒక జ్ఞాపకంగా మిగలబోతోంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జి కూల్చివేతలు మొదలుపెట్టారు. కొత్త డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఈ పాత బ్రిడ్జి పిల్లర్లను కూల్చివేయబోతున్నారు. హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో కూల్చివేతలు సాధ్యం కాకపోవడంతో అధికారులు లిమిటెడ్ బ్లాస్టింగ్ విధానంలో కూల్చేందుకు సిద్ధమవుతున్నారట.

విజయవాడలో 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బ్రిటీష్ కాలం నాటి రైల్వే బ్రిడ్జి కనుమరుగు కాబోతోంది. 1893లో నిర్మించిన ఈ బ్రిడ్జి స్థానంలో కొత్తగా డబుల్ లైన్ బ్రిడ్జిని నిర్మించాలని రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. గతంలోనే ఈ బ్రిడ్జిపై ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయగా.. ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించి మిగిలిన పిల్లర్లను తొలగించే పనులు చేపట్టారు. రెండు వారాలకు పైగా హైడ్రాలిక్ క్రేన్ల సహాయంతో పిల్లర్లను పగలగొట్టాలని ప్రయత్నించారు.. కానీ వీలు పడలేదు. అందుకే ఈ పిల్లర్లను కూల్చివేసేందుకు లిమిటెడ్ బ్లాస్టింగ్ పద్ధతిలో కూల్చివేతలు ప్రారంభించనున్నారు. ఈ విధానంలో ఒక్కో పిల్లర్‌ను తొలగిస్తూ పోవాలి.. దీనికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు.

1856 ప్రాంతంలో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎం (మద్రాస్ టు సదరన్ మరాఠా) రైల్వేలో విజయవాడ కూడా ఒక భాగంగా ఉండేది. 1893లో కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల పొడవున మీటర్ గేజ్‌ విధానంలో ఈ రైలు బ్రిడ్జిని నిర్మించి కృష్ణా ప్యాలెస్‌గా పేరు పెట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి స్టీల్ వాడకుండా రాతి బండలు, సున్నం సాయంతో నిర్మించారట. 1897లో ఈ రైల్వే బ్రిడ్జిని బ్రాడ్ గేజ్‌గా అప్‌గ్రేడ్ చేశారట. అనంతరం రైల్వేశాఖ ఈ బ్రిడ్జికి తూర్పు, పశ్చిమ వైపులా రైల్వే బ్రిడ్జిల నిర్మాణం చేసింది. ఆ తర్వాత ఈ కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జికి సంబంధించి బ్రిడ్జిని తొలగించగా కేవలం పిల్లర్లు మాత్రమే మిగిలాయి. అప్పటి నుంచి ఈ పిల్లర్లు అలాగే ఉండిపోయాయి. అయితే ప్రస్తుతం విజయవాడ గూడూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టడంతో డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి నిర్మించాలని ప్రణాళిక చేశారు. అందుకే ప్రస్తుతం చారిత్రక కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జికి సంబంధించి మిగిలిన పిల్లర్లను కూడా తొలగించాలని నిర్ణయించారు.

130 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ బ్రిడ్జికి సంబంధించి పిల్లర్లను తొలగించవద్దని గతంలో కొందరు రైల్వే అధికారులు కోరారు, లేఖలు రాశారు. దీంతో ఈ బ్రిడ్జి జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి కోసం కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జి పిల్లర్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ బ్రిడ్జిని వదిలేసి అవతల కొత్త బ్రిడ్జి నిర్మించాలన్నా అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయట. అందుకే ఈ పాత బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జిని నిర్మించాలని ప్లాన్ చేశారు. పిల్లర్లను తొలగించే ప్రక్రియను మొదలు పెట్టారు. హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో తొలగింపు సాధ్యం కాలేదు. అందుకే లిమిటెడ్ బ్లాస్టింగ్ ద్వారా ఈ పిల్లర్లను కూల్చే పనులు ప్రారంభించనున్నారు. ఈ విధానంలో ముందు పిల్లర్లకు పగుళ్లు వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో వీటిని తొలగించనున్నారు. దీంతో విజయవాడ చరిత్రలో ‘కృష్ణా ప్యాలెస్’ వంతెన జ్ఞాపకంగా మిగలబోతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Bridge Demolition
  • Old Krishna Palace
  • Railway Bridge Demolition
  • vijayawada

Related News

'birla New'

‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

దక్షిణ భారత మార్కెట్‌పై బిర్లా న్యూ ప్రత్యేక దృష్టి సారించిందనేందుకు విజయవాడను ఎంచుకోవడమే నిదర్శనం. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రూ. 127 కోట్ల వ్యయంతో ఫైబర్ సిమెంట్ బోర్డు ప్లాంట్‌ను నెలకొల్పిన ఈ సంస్థ, ఇప్పుడు వినియోగదారులకు నేరుగా చేరువయ్యేందుకు

  • Featherlight

    Featherlight : విజయవాడలో ‘ఫెదర్‌లైట్’ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను ప్రారంభం

  • Manufacture Of Fighter Airc

    DRDO : పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ.. !

  • Pawancbn1

    Pawankalyan : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో చూడండి !!

  • amaravati farmers land allotment

    Amaravati : అమరావతి రైతులకు గొప్ప శుభవార్త..

Latest News

  • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

  • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

  • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

  • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

  • Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd