Nara Lokesh: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై మంత్రి లోకేష్ షాకింగ్ కామెంట్స్
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల వివాదం కేవలం ముగ్గురు-నలుగురు విద్యార్థుల మధ్య గొడవ అని ఆయన కొట్టిపారేశారు మంత్రి నారా లోకేష్. ఎక్కడా రహస్య కెమెరా కనిపించకపోవడంతో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోందన్నారు.
- By Praveen Aluthuru Published Date - 07:00 PM, Sun - 1 September 24

Nara Lokesh: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు ఏర్పాటు సంచలనంగా మారింది. ఈ ఇష్యూపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మంత్రి నారా లోకేష్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు కాలేజీలో సీసీ కెమెరాలు లేవని ఖండించారు మంత్రి నారా లోకేష్.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేయలేదని మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఈ వివాదాన్ని నలుగురు విద్యార్థుల మధ్య వివాదంగా కొట్టిపారేశాడు మంత్రి లోకేష్. ఇంజినీరింగ్ కళాశాలలో ఎక్కడ కూడా రహస్య కెమెరాలు లేవని ఆయన అన్నారు. ఈ అంశాన్ని ఓ వర్గం మీడియా తమకు అనుకూలంగా మార్చుకుంటుందని స్పష్టం చేశారు లోకేష్. కాగా రహస్య కెమెరాల ఆరోపణలకు ఎలాంటి వీడియో ఆధారాలు లేవన్నారు.
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో చెలరేగిన వివాదాన్ని బ్లూ మీడియా సంచలనం చేసేందుకు ప్రయత్నించిందని అన్నారు. వైసీపీకి సన్నిహితంగా భావించే మీడియా సంస్థలను ఆయన ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ చిన్న సంఘటన జరిగినా సంచలనం చేసేందుకే ఈ మీడియా పనిచేస్తోందని లోకేష్ అన్నారు. నాపై లేనిపోని కుట్రలు చేస్తున్నారని, ఇందుకోసం మీడియా సంస్థలు పని చేస్తుందని చెప్పారు నారా లోకేష్. నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నన్ను టార్గెట్ చేస్తున్నారని లోకేష్నాచెప్పుకొచ్చారు. అయితే తాజా కాలేజీ అంశంపై లోకేష్ మాట్లాడుతూ.. కాలేజీలో ఏం జరిగిందో అంతా మీడియాకు తెలుసని, సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేశామని హెచ్చరించారు లోకేష్.
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల వివాదం కేవలం ముగ్గురు-నలుగురు విద్యార్థుల మధ్య గొడవ అని ఆయన కొట్టిపారేశారు. ఎక్కడా రహస్య కెమెరా కనిపించకపోవడంతో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోందన్నారు. ఈ విషయంలో మీడియా కల్పితం మాత్రమేనని, దాచిన కెమెరా చూపించమని అడిగారు మంత్రి లోకేష్. ఈ మేరకు పోలీసులు క్యాంపస్‌లో సోదాలు చేశారని, విద్యార్థులకు రహస్య కెమెరాలు కనిపించలేదని అన్నారు నారా లోకేష్.
కాలేజీ హాస్టల్‌లోని బాలికల టాయిలెట్‌లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై ఆగస్టు 29, 30 తేదీల్లో విద్యార్థుల్లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.కొద్ది రోజుల క్రితమే మహిళా మరుగుదొడ్లలో కెమెరాలు అమర్చారని, ఫిర్యాదు చేసినా వార్డెన్, కళాశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళనకారులు ఆరోపించారు. ఆగస్టు 30న నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆరోపణలపై అదే రోజు విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Also Read: PM Modi : భారత పారా అథ్లెట్లతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ