HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >New Technology To Replace Old Policies Cm Chandrababu

CM Chandrababu : పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికత : సీఎం చంద్రబాబు

ఏఐ, ఎమర్జింగ్‌ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైనా ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. 30 ఏళ్లనాడు చేసిన ప్రయత్నంతో నేడు ఏపీ టెక్నాలజీలో కీలకంగా ముందుందని ప్రస్తావించారు. మన ప్రభుత్వ వ్యవస్థల్లో మేథాసంపత్తి ఉన్నవారు ఉన్నప్పటికీ ఇంకా పాత విధానాలు అనుసరిస్తున్నారని, పాలనలో తీరు మారాలన్నారు.

  • Author : Latha Suma Date : 24-04-2025 - 4:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New technology to replace old policies: CM Chandrababu
New technology to replace old policies: CM Chandrababu

CM Chandrababu : ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్’ అంశంపై గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన వర్క్‌షాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఏఐ, ఎమర్జింగ్‌ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైనా ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. 30 ఏళ్లనాడు చేసిన ప్రయత్నంతో నేడు ఏపీ టెక్నాలజీలో కీలకంగా ముందుందని ప్రస్తావించారు. మన ప్రభుత్వ వ్యవస్థల్లో మేథాసంపత్తి ఉన్నవారు ఉన్నప్పటికీ ఇంకా పాత విధానాలు అనుసరిస్తున్నారని, పాలనలో తీరు మారాలన్నారు.

Read Also: Pawan Kalyan : చిన్న కోరికను కూడా తీర్చుకోలేకపోతున్న డిప్యూటీ సీఎం పవన్

టెక్నాలజీ అనేది ప్రజల కోసం ఉపయోగపడాలని, రాష్ట్రంలో భారీ డేటా లేక్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వర్క్‌షాప్ దేశానికి ఒక నమూనాగా నిలుస్తుందని, డిజిటల్, డైనమిక్, ప్రజల కోసం పని చేసే పాలనకు ఇది ఆరంభమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతుల్లో అధికంగా 75 శాతం భూసంబంధితమైనవే ఉన్నాయని, ఈ సమస్య పరిష్కారానికి త్వరితగతిన భూ రికార్డుల డిజిటలైజేషన్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకప్పుడు ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను ఆశ్చర్యంగా చూశామని, ఇప్పుడు మన స్టార్టప్‌లు రూ.30 కోట్లతో ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయని, దీంతో ప్రపంచం మనవైపు గర్వంగా చూస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఇక, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, ఫలితాలను పరిశీలించారు. గుడ్‌ గవర్నెన్స్‌ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు. భూ రికార్డుల డిజిటలైజేషన్‌ వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ వర్క్‌షాప్‌ రెండు రోజుల పాటు జరగనుంది. ఈ వర్క్‌షాప్‌నకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీశాఖ మాజీ సెక్రెటరీ చంద్రశేఖర్‌ సహా పలువురు నిపుణులు హాజరయ్యారు.

Read Also: Maoists : వరంగల్‎లో భారీగా మావోయిస్టులు లొంగుబాటు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Artificial Intelligence
  • CM Chandrababu
  • Emerging Technologies
  • New Technology
  • Secretariat

Related News

Nara Lokesh

Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd