HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >New Scheme In Ap Survey Started

New Scheme : ఏపీలో కొత్త పథకం.. మొదలైన సర్వే

మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది. ఇంటి యజమాని ఆధార్‌, ఫోన్‌ నంబర్‌, టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్‌, ఏసీ, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ ఉందా? కరెంట్‌ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.

  • Author : Latha Suma Date : 09-03-2025 - 12:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New scheme in AP.. survey started
New scheme in AP.. survey started

New Scheme : ఏపీలో పీ-4 పేరుతో కొత్త పథకాన్ని ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకు 16 జిల్లాల్లో నిన్నటి నుంచి సర్వే మొదలైంది. ఈ నెల 18 వరకు సర్వే పూర్తి చేయాలి. 21 నుంచి 23 వరకు గ్రామాల వారీగా సభలు నిర్వహించి వివరాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఉగాది రోజు పీ-4 కార్యక్రమ వివరాలను ప్రకటిస్తారు. ఇక, మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది. ఇంటి యజమాని ఆధార్‌, ఫోన్‌ నంబర్‌, టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్‌, ఏసీ, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ ఉందా? కరెంట్‌ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.

Read Also: Kulbhushan Jadhav: కులభూషణ్‌‌ను పాక్‌కు పట్టించిన ముఫ్తీ షా మిర్‌ హతం.. ఎవరు ?

ముందుగా నాలుగు గ్రామాల్లో పీ-4 విధానం పైలట్‌ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ పీ – 4 కార్యక్రమానికి 2 ఎకరాల మాగాణి / ఐదు ఎకరాల మెట్ట భూమి, ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్‌ పేయర్స్‌, ఫోర్‌ వీలర్స్‌ ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్‌ వాడే వారు అర్హులు కారు. ఉగాది నుంచి పీ-4 విధానం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా పీ-4లో ఉన్న వారికి చేయూత ఇస్తామని చెప్పారు.

పీ4 విధానాన్ని.. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్ (PPPP)గా పిలుస్తారు. ఈ పథకానికి సరైన రూపాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయ సేకరణ సర్వే నిర్వహిస్తోంది. ఫిబ్రవరిలో ప్రారంభమైన తొలి విడత సర్వే పూర్తయింది. మార్చి 8 నుంచి రెండో విడత మొదలైంది. గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆర్థిక పరిస్థితి, వారికి ఎంత వరకు ఆసక్తి ఉందో తెలుసుకుంటున్నారు.ఈ వివరాలు అన్నీ సచివాలయ ఉద్యోగులు ఒక యాప్‌లో పొందుపరుస్తారు. ఉగాది రోజున ప్రభుత్వం అధికారికంగా పీ4 విధానాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా.. ప్రజలు పెట్టుబడి పెట్టడానికి వీలుగా ఒక ప్రత్యేక వెబ్‌సైట్, మొబైల్ యాప్ అందుబాటులోకి రానున్నాయి. ఇది విజయవంతమైతే.. దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Mlc : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, సామా, అద్దంకి ?

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • new scheme
  • P-4 procedure
  • Public Private People Partnership
  • Ugadi Festival

Related News

Godavari Pushkaralu 2027 to Be Held on Kumbh Mela Scale as Pawan Kalyan

Godavari Pushkaralu: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివిధ అంశాలపై చర్చించారని, ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శ

  • AndhraPradesh Police Special Leaves

    AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. వారికి స్పెషల్ లీవ్స్

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd