Cockfighting : రూ.కోటి గెలిచిన ‘నెమలి పుంజు’
Cockfighting : గుడివాడకు చెందిన ప్రభాకర్ రావు తమ నెమలి పుంజును బరిలోకి దింపగా, రత్తయ్య రసంగి పుంజుతో పోటీకి దిగారు
- By Sudheer Published Date - 05:05 PM, Wed - 15 January 25

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం (Tadepalligudem)లో జరిగిన కోళ్ల పందెం (Cockfighting ) దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఈ పోటీలో భారీ మొత్తంలో పందేలు కాసారు. గుడివాడకు చెందిన ప్రభాకర్ రావు తమ నెమలి పుంజును బరిలోకి దింపగా, రత్తయ్య రసంగి పుంజుతో పోటీకి దిగారు. ఈ పోటీలో గెలిచిన నెమలి పుంజు ప్రభాకర్ రావుకు భారీ మొత్తాన్ని తెచ్చిపెట్టింది. బరిలో మొత్తం రూ.1.25 కోట్లకు పైగా పందెం కాశారు. బెట్టింగ్ రాయుళ్ల మధ్య పోటీ వేడి తారా స్థాయికి చేరింది. ఈ పోటీలో విజయం సాధించిన నెమలి పుంజు ప్రభాకర్ రావుకు కోటి రూపాయల లాభాన్ని అందించింది. మరోవైపు రత్తయ్య రూ.20 లక్షల నష్టం చవిచూశారు.
Daaku Maharaaj Collection: బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఊచకోత.. 3 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
కోళ్ల పందెం నేపథ్యంలో భీమవరంలో నిన్న ఒక్క రోజులోనే రూ.150 కోట్లకు పైగా డబ్బు చేతులు మారినట్లు సమాచారం. ఈ రకమైన పందేలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నప్పటికీ, పోలీసుల పర్యవేక్షణ అందివ్వడం కష్టంగా మారింది. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఈ పందేలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాడేపల్లిగూడెం కోళ్ల పందెం వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత నాల్గు రోజులుగా జరుగుతున్న ఈ పందేలు ప్రజలకు వినోదాన్ని కలిగిస్తున్నప్పటికీ, చట్టబద్ధతపై ప్రశ్నలు వెలువడుతున్నాయి. కోళ్ల పందెంలో భారీ మొత్తాలు బెట్టింగ్ రూపంలో మారడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.