Daaku Maharaaj Collection: బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఊచకోత.. 3 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
డాకు మహారాజ్‌తో పాటు రిలీజైన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.
- By Gopichand Published Date - 04:37 PM, Wed - 15 January 25

Daaku Maharaaj Collection: నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ (Daaku Maharaaj Collection) మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మూడు రోజుల కలెక్షన్స్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మొదటి రోజు రూ. 56 కోట్లతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య డాకు మహారాజ్ అదే ఊపును కొనసాగుతోంది. మొత్తం మూడు రోజులకు గాను ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 92 కోట్లు సాధించినట్లు చిత్ర నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎక్స్ వేదికగా ఓ పోస్టర్ విడుదల చేసింది. డాకు మహారాజ్ సంక్రాంతికి అసలైన సినిమా అని, బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తుందని ఎక్స్‌లో రాసుకొచ్చారు. సంక్రాంతికి సరైన ఫ్యామిలీ, కమర్షియల్ మూవీ అని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పేర్కొంది.
Also Read: Game Changer : రూ.100 కోట్ల క్లబ్ లో గేమ్ ఛేంజర్
The King of Sankranthi Delivers Big 🔥#DaakuMaharaaj clocks 𝟗𝟐 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟑 𝐃𝐚𝐲𝐬 – Ruling the box office and hearts alike! 💥💥
A PERFECT SANKRANTHI treat packed with high octane action and heartwarming family emotions! ❤️… pic.twitter.com/duMQ4H4zm6
— Sithara Entertainments (@SitharaEnts) January 15, 2025
ఇకపోతే బాలకృష్ణ 109వ చిత్రంగా రూపొందిన ఈ డాకు మహారాజ్ మూవీని డైరెక్టర్ బాబీ అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేతో పాటు థమన్ మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ను తనదైన శైలిలో కొట్టే థమన్ బాలయ్య అనగానే స్పీకర్లు సైతం పగిలిపోయేలా నేపథ్య సంగీతం అందిస్తుంటాడు. అఖండ తర్వాత మరోసారి ఆ రేంజ్‌లో డాకు మహారాజ్ మూవీకే థమన్ బ్యాగ్రౌండ్ అందించాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీ రూ. 150 కోట్ల వరకు కలెక్షన్స్ సాధిస్తుందని చిత్రబృందం ధీమాగా ఉంది. పండుగ సీజన్ కావడంతో ఈరోజు, రేపు కూడా ఈ మూవీ కలెక్షన్స్ సాలిడ్‌గా ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
డాకు మహారాజ్‌తో పాటు రిలీజైన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూడు సినిమాల కథలు విభిన్నం కావడంతో ఆడియన్స్ ఆదరిస్తున్నారు. డాకు మహారాజ్‌లో నందమూరి బాలకృష్ణతో పాటు బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ప్రకాష్ రాజ్, తదితరులు నటించారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.