HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Yuvagalam Padayatra Continues Successfully

Nara Lokesh: జ‌గ‌న్ బాట‌లో నారా లోకేష్‌.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు

ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనుస‌రించిన విధానాన్నే యువ‌గ‌ళం పాద‌యాత్రలో నారా లోకేష్ ఫాలో అవుతున్న‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

  • Author : News Desk Date : 16-06-2023 - 11:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు టీడీపీ (TDP) అన్ని అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటోంది. ఆపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. అందివ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. చంద్ర‌బాబు నాయుడుతో పాటు నారా లోకేష్ (Nara Lokesh), టీడీపీ నేత‌లు నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జావ్య‌తిరేఖ విధానాల‌ను కొన‌సాగిస్తుందంటూ ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. టీడీపీ అధికారంలోకివ‌స్తే ఏఏ ప‌థ‌కాలు అమ‌లు చేస్తుందో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. దీనికితోడు నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం (Yuvagalam) పాద‌యాత్రకు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది.

యువ‌గ‌ళం పాద‌యాత్ర విజ‌యవంతంగా సాగుతుండ‌టంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ క‌నిపిస్తోంది. యువ‌గ‌ళం పాద‌యాత్ర ముందు వ‌ర‌కు లోకేష్‌ను ప‌ప్పు అంటూ కామెంట్స్ చేస్తూ వ‌చ్చిన వైసీపీ శ్రేణులుసైతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో లోకేష్ జోరును చూసి ఆశ్చ‌ర్య‌పోతున్న ప‌రిస్థితి. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో భేటీ అవుతున్న లోకేశ్ టీడీపీ అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తారో స్ప‌ష్టంగా వివ‌రిస్తున్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో నారా లోకేష్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఫాలో అవుతున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతుంది.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలోనూ, ప‌లు సంద‌ర్భాల్లో అధికారంలోకి వ‌చ్చేది మేమే.. మీ అంతు చూస్తాం అంటూ త‌న‌కు అడ్డు త‌గిలిన అధికారుల‌ను హెచ్చ‌రించారు. దీంతో, కొన్ని సంద‌ర్భాల్లో అధికారులుసైతం జ‌గ‌న్ జోలికి వెళ్లేందుకు వెనుక‌డుగు వేశారు. అదే విధానాన్ని ప్ర‌స్తుతం లోకేష్ ఫాలో అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. పాద‌యాత్ర స‌మ‌యంలో త‌న‌కు అడ్డు త‌గిలిన పోలీసు అధికారుల‌కు, వైసీపీ నేత‌ల‌కు లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చేది టీడీపీనే. నేను ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌ను. నాకు అడ్డువ‌చ్చిన అంద‌రి పేర్ల‌ను నా ఎర్రబుక్లో రాసుకుంటున్నా. అధికారంలోకి రాగానే ప్ర‌తి ఒక్క‌రి లెక్క‌స‌రిచేస్తా అంటూ లోకేష్ వార్నింగ్ ఇస్తున్నారు.

Pawan Kalyan : నాకు అధికారం ఇవ్వండి.. సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. గుండా కొడుకులకు నరకం చూపిస్తా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • chandrababu naidu
  • nara lokesh
  • yuvagalam

Related News

CM Chandrababu Naidu

CM Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి (ఈ నెల 11న) ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవివాదాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షిం

  • Nara Lokesh

    AP ECET 2026 results: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల : నారా లోకేశ్

  • Rayalaseema is now 'Royal' Seema... Chandrababu's intriguing tweet!

    CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

Latest News

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

  • Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

  • Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

  • Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..

  • Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd