Pawan Kalyan : నాకు అధికారం ఇవ్వండి.. సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. గుండా కొడుకులకు నరకం చూపిస్తా
నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. నేను గెలవడానికి ఏ వ్యూహం అయిన వేస్తా. నాకు అధికారం ఇవ్వండి అంటూ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
- Author : News Desk
Date : 16-06-2023 - 10:42 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) లో భాగంగా పిఠాపురం బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. నేను గెలవడానికి ఏ వ్యూహం అయిన వేస్తాను. నాకు అధికారం ఇవ్వండంటూ ప్రజలను పవన్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం (ycp government) పై పవన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చచ్చు ప్రభుత్వం హిందు దేవాలయాలపై దాడిని పట్టించుకోవడం లేదన్నారు. క్రిమినల్స్ ను వెనుకేసుకొని వస్తున్నారని విమర్శించారు. అమ్మవారి సాక్షిగా నేను ఆంధ్రని విడిచి వెళ్ళను. గుండాగాళ్ల కాళ్ళు, కీళ్లు విరగ గొడతాను అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
తిరుపతిని దోపిడీ చేస్తున్నారు. తిరుపతి శ్రీ వాణి ట్రస్ట్ లో దోపిడీ జరుగుతుందని పవన్ ఆరోపించారు. పిఠాపురంలో రోజుకి 2 కోట్ల విలువ మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు దోచుకుంటున్నారు. అమిత్ షా దగ్గర కాకినాడ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుల రిపోర్ట్ ఉంది. అందుకే వైజాగ్‌లో అమిత్ షా మాట్లాడారు. వాళ్ళపని కాకినాడ వెళ్ళాక చెప్తాను అంటూ పవన్ వ్యాఖ్యానించారు. వ్యవసాయశాఖ మంత్రి నాకు ఎన్ని రకాలు ధాన్యాలు ఉన్నాయో తెలుసా అంటున్నాడు? పుట్టగానే అందరికీ అన్ని తెలుస్తాయా అంటూ పవన్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుక కాంట్రాక్టుల నుంచి 10వేల కోట్లు సంపాదిస్తున్నాడంటూ పవన్ ఆరోపించారు.
వైసీపీ నేతలు పిచ్చివాగుడు మానుకోవాలి. పిచ్చి వాగుడు వాగితే బయటకు తీసుకు వచ్చి కొడతా. జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండా కొడుకులకు నరకం చూపిస్తా అంటూ పవన్ అన్నారు. సీఎం నోట్లో వేలు పెడితే కొరకలేడు అన్నట్లుగా పోజులిస్తాడంటూ పవన్ విమర్శించారు. నేర చరిత్ర ఉన్నవాళ్ళు గద్దె ఎక్కడానికి నేను ఊరుకొను. ఈసారి మన కులపోడు అని కాదు.. సరైనోడా కాదా అని చూసి ఓటువేయండి అంటూ పవన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Telangana Congress: కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న నేతలు.. రాజగోపాల్‌రెడ్డి కూడా వస్తున్నారా?