Rajahmundry Jail : చంద్రబాబు ను జైల్లోనే అంతం చేసేందుకు కుట్ర – నారా లోకేష్ సంచలన ట్వీట్
జైలులోనే చంద్రబాబును చంపే కుట్ర జరుగుతుందన్నారు. సైకో జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి జైలులోనే అంతం చేేసే ఆలోచన చేస్తున్నారని లోకేష్ అన్నారు
- Author : Sudheer
Date : 21-09-2023 - 12:46 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ట్వీట్ చేసారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు (kill Development Case)లో చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత 10 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైల్లో (Rajahmundry Jail) ఉన్నారు. బెయిల్ కోసం ఎంత ట్రై చేసిన రావడం లేదు..మరోపక్క ఆ కేసు , ఈ కేసు అని చెప్పి చంద్రబాబు ఫై అక్రమ కేసులన్నీ పెట్టి బాబు ను మరింత ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈ తరుణంలో లోకేష్ ట్విట్టర్ లో సంచలన ట్వీట్ చేసారు.
జైలులోనే చంద్రబాబును చంపే కుట్ర (Chandrababu Murder) జరుగుతుందన్నారు. సైకో జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి జైలులోనే అంతం చేేసే ఆలోచన చేస్తున్నారని లోకేష్ అన్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యత అని లోకేష్ అన్నారు. ఆధారాలు లేని కేసులో బెయిల్ రాకుండా జెల్ లోనే చంపేందుకు పెద్ద ప్లాన్ వేశారంటూ లోకేష్ ఆరోపించారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది. బాబు గారికి జైలులో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
Read Also : Emergency Alert : మీ ఫోన్ కు ”ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్” వచ్చిందా..?
జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. బాబు గారికి ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు గారికి ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
మరోపక్క అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Amaravati Inner Ring Road Case )లో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు (AP High Court) ఈ నెల 26 కు వాయిదా వేసింది. హైబ్రిడ్ విధానంలో ఈ కేసు విచారణకు హైకోర్టు అంగీకరించింది. దీంతో చంద్రబాబు కు బెయిల్ వస్తుందని అంత అనుకున్నారు కానీ నిరాశే మిగిలింది.
https://x.com/naralokesh/status/1704739225772441769?