Nara Lokesh : జగన్ కు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చే వారం బయటపెడతా..!!!
టీడీపీ జాతీయ నేత నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. ఏపీ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రకటన చేశారు.
- Author : hashtagu
Date : 16-08-2022 - 8:31 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ జాతీయ నేత నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. ఏపీ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రకటన చేశారు. జగన్ కు సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని వచ్చేవారం బయటపెడతానంటూ తెలిపారు. ED, ET, CBIకి భయపడి ఢిల్లీలో తలవంచారని విమర్శించారు. జగన్ వన్నీ పదోతరగతి పాస్ డిగ్రీ ఫెయిల్ తెలివితేటలన్నారు.
వైసీపీ హయాంలో వచ్చిననాటి కంటే వెళ్లిపోయిన పరిశ్రమలే ఎక్కువని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతనేది చర్చకు వస్తుందని ఆరోపించారు. వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తే చర్చకు సిద్ధమని లోకేశ్ ప్రకటించారు.