Andhra Pradesh: బీసీలపై టీడీపీ చిత్తశుద్ధి: జయహో బీసీ సదస్సు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఒంగోలులో జయహో బీసీ సదస్సు నిర్వహించారు.
- Author : Praveen Aluthuru
Date : 28-07-2023 - 8:43 IST
Published By : Hashtagu Telugu Desk
Andhra Pradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఒంగోలులో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుంచి బీసీలు తరలివచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడారు.
బీసీలపై మాకు చిత్తశుద్ధి ఉందని చెప్పారు లోకేష్. గతంలో అనేక బీసీ కార్యక్రమాలు చేపట్టామని ఆయన అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ సీఎం హోదాలో అనేక బీసీ కార్యక్రమాలు చేసి చూపించమని, పటేల్, పట్వారీ వ్యవస్థను తీసేశామని లోకేష్ గుర్తు చేశారు. రాజకీయాల్లోనూ బీసీలకు పెద్దపీట వేశామని, మంత్రుల్ని, ఎంపీలు, స్పీకర్లని చేసిన ఘనత టీడీపీ పార్టీదేనని తెలిపారు. గతంలో ఎన్టీఆర్ బిసిలకు 24 శాతం రిజర్వేషన్ కల్పించారని, దాన్ని చంద్రబాబు 34 శాతానికి పెంచారని అన్నారు. గడిచిన పాదయాత్రలో అనేక బీసీ సంఘాలను, నాయకులను, ప్రజల్ని కలిశానని, వారి బాధలు, సమస్యలు, డిమాండ్లు తెలుసుకున్నానని ఈ సందర్భంగా తెలిపారు నారా లోకేష్. అయితే బీసీల గురించి మరింత తెలుసుకునేందుకే జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు.
జయహో బీసీ సదస్సులో భాగంగా గతంలో చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణలను నారా లోకేష్ గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బీసీ స్టూడెంట్స్ కోసం విదేశీ విద్య పథకాన్ని అమలు చేసినట్టు లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను విదేశాలకు పంపాలని సంకల్పించింది తెలుగుదేశం పార్టీనేనని చెప్పారు. బీసీల గురించి మాట్లాడిన, పోరాటం చేసిన వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదని మండిపడ్డారు లోకేష్. బీసీలకు రక్షణ చట్టాన్ని మేం అధికారంలోకి వచ్చిన మొదటి సంత్సరంలోనే అమలు పరుస్తామని స్పష్టం చేశారు లోకేష్.
Also Read:Telangana Rains: ఎట్టి పరిస్థితుల్లో ప్రాణనష్టం జరగొద్దు, మంత్రులకు సీఎం ఆదేశాలు