Nara Lokesh: భూ వివాదాలపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్
28వ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో "ప్రజాదర్బార్" లో మంత్రి లోకేష్ భూ వివాదాలకు సంబంధించి పెరుగుతున్న విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించారు, సత్వర పరిష్కారాల కోసం తన సిబ్బందిని సంబంధిత శాఖలతో సమర్థవంతంగా సమన్వయం చేయాలని కోరారు
- Author : Praveen Aluthuru
Date : 20-08-2024 - 3:51 IST
Published By : Hashtagu Telugu Desk
Nara Lokesh: నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు. మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పిన విషయం తెలిసిందే. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాదర్బార్ ద్వారా నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 8గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో నారా లోకేష్ ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చొరవ చూపిస్తున్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే క్రమంలో ఉపేక్షించేది లేదని, ప్రజా దర్బార్ లో విన్నవించిన సమస్యలను కచ్చితంగా నిరవేర్చాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ నిబద్ధత కొనసాగిస్తున్నారు.
28వ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో “ప్రజాదర్బార్” నిర్వహించగా మంగళగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు తరలివచ్చారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ భూ వివాదాలకు సంబంధించి పెరుగుతున్న విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించారు, సత్వర పరిష్కారాల కోసం తన సిబ్బందిని సంబంధిత శాఖలతో సమర్థవంతంగా సమన్వయం చేయాలని కోరారు. హాజరైన వారు సమర్పించిన ఫిర్యాదులను ఆయన శ్రద్ధగా విని, వారి విజ్ఞప్తుల పరిష్కారానికి అంకితభావంతో ఉంటామని హామీ ఇచ్చారు.
పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధుల బృందం “ప్రజాదర్బార్” కి వచ్చారు. వాళ్లంతా కలిసి 28,000 కూడబెట్టి అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఉదారంగా సహకారం అందించిన సీనియర్ సిటిజన్లను అభినందించారు.
Also Read: Jio Recharge Plan : రిలయన్స్ జియో చౌక రీఛార్జ్ ప్లాన్.. ధర, వ్యాలిడిటీ వివరాలివీ